నా బాయ్ ఫ్రెండ్ గురించి మా ఆయనకు తెలుసంటున్న హీరోయిన్...

బాలీవుడ్లో తాజాగా విడుదలైన టువంటి తానాజీ చిత్రం మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఓమ్ రావత్ దర్శకత్వం వహించాడు.

 Kajol Ajaydevagan Tanagi Omravath-TeluguStop.com

ఈ చిత్రంలో అజయ్ దేవగన్, సైఫ్ అలీ ఖాన్, కాజోల్, నేహ శర్మ, జగపతిబాబు, వంటి వారు ప్రధాన తారాగణంగా నటించారు.తాజాగా ప్రముఖ హీరోయిన్ కాజల్ ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఓ ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఇందులో భాగంగా తమ వ్యక్తిగత విషయాలను కొన్ని తన అభిమానులతో పంచుకున్నారు.

అయితే ఇందులో భాగంగా తనకు అజయ్ దేవగన్ తో పెళ్లి కాకముందు ఓ బాయ్ ఫ్రెండ్ ఉండే వాడని చెప్పుకొచ్చారు.

ఈ విషయం గురించి అజయ్ దేవగన్ కి కూడా తెలుసని అన్నారు.అయితే అతడితో కొన్ని రోజులు ప్రేమలో ఉన్నానని ఆ తర్వాత మా మధ్య మనస్పర్థల కారణంగా విభేదాలు వచ్చాయని దాంతో విడిపోయామని చెప్పారు.

దాంతో మళ్లీ తప్పు జరుపుకూడదని తాను అజయ్ దేవగన్ నాలుగు సంవత్సరాల కాలం పాటు ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నామని చెప్పుకొచ్చారు.

Telugu Ajaydevgan, Kajol, Tanhaji-Movie

అయితే తన ఇష్టాలని అజయ్ ఎంతో  గౌరవిస్తాడని అంతేగాక తమ పిల్లల విషయంలో కూడా ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తాడని చెప్పుకొచ్చింది కాజోల్.అయితే ఇది ఇలా ఉండగా ఇప్పటికే ఈ జంటను బాలీవుడ్ లో ది బెస్ట్ కపుల్ గా అందరు చెప్పుకుంటారు.అందుకు తగ్గట్టుగానే కాజల్ అజయ్ దేవగన్ లు కూడా అంతే అన్యోన్యంగా ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube