తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం దర్బార్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మొదట్నుండీ ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
సూపర్ స్టార్ సూపర్ పర్ఫార్మెన్స్, స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌లో సినిమా అనగానే ఇండస్ట్రీ వర్గాల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక దర్బార్ చిత్రాన్ని బుధవారం రాత్రే యూఎస్‌లో ప్రీమియర్లు వేసారు.
అక్కడ దర్బార్ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది.ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్ల ద్వారా 4 లక్షల డాలర్లు కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
మొత్తం ప్రీమియర్లు ముగిసే సరికి దర్బార్ మూవీ ఏకంగా మిలియన్ మార్క్‌ను క్రాస్ చేయడం ఖాయమని అంటున్నారు సినీ వర్గాలు.
రజనీ స్టైల్, మురుగదాస్ టేకింగ్ స్టైల్ కలగలిసి దర్బార్ సినిమాను ఫక్తు కమర్షియల్ మూవీగా రూపొందించారు.
ఈ సినిమాతో రజినీ తన ఫ్యాన్స్‌కు మాస్ మసాలా ట్రీట్ ఇచ్చినందుకు దర్శకుడు ఏఆర్ మురుగదాస్‌కు వారంతా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా దర్బార్ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుండటంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.