మెగా 152 : 99 రోజుల లెక్కలు మారుతున్నాయేంటి?

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం కోసం ఏకంగా రెండు సంవత్సరాలు తీసుకున్నాడు.సైరా భారీ బడ్జెట్‌ చిత్రం అవ్వడంతో పాటు పీరియాడిక్‌ మూవీ అవ్వడం వల్ల అంత సమయం పట్టింది.

 Chiranjeevi Koratala Siva Ram Charan-TeluguStop.com

కాని ఇకపై అంత సమయం తీసుకోకుండా చకా చకా సినిమాలు చేయాలని చిరంజీవి భావిస్తున్నాడు.అందుకోసం దర్శకులకు ముందుగానే వార్నింగ్‌ ఇస్తున్నాడు.

సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక సందర్బంగా చిరంజీవి స్టేజ్‌ పైకి కొరటాల శివను పిలిచి మరీ కేవలం 99 రోజుల్లోనే సినిమాను పూర్తి చేయబోతున్నట్లుగా ప్రకటించాడు.

సినిమా షూటింగ్‌ అయితే ప్రారంభం అయ్యింది.

ఇప్పటికే నెల రోజులు కూడా పూర్తి అయ్యింది.ఈ లెక్కన చూసుకుంటే మరో 69 రోజుల్లో షూటింగ్‌ పూర్తి అవ్వాలి.

కాని అసలు విషయం ఏంటీ అంటే కేవలం షెడ్యూల్‌ డేట్లు మాత్రమే 99 రోజులు.అంటే వర్కింగ్‌ డేస్‌ను మాత్రమే లెక్కించాలట.99 రోజులు వర్కింగ్‌ డేస్‌లో సినిమా పూర్తి అవుతుందన్న మాట.అంటే మద్యలో నెలలు వారాలు గ్యాప్‌ తీసుకుంటూ మెల్లగా షూటింగ్‌ చేస్తూ ఉంటారు.అలా అయితే ఆరు నెలలకు పైగా పట్టే అవకాశం ఉంది.

Telugu Koratala Siva, Chiranjeevi, Ram Charan, Tollywood Box-

99 రోజులు అనగానే అభిమానులు మరియు ప్రేక్షకులు ఏవో లెక్కలు వేసుకుని వెంటనే మెగాస్టార్‌ చిరంజీవి సినిమా వచ్చేస్తుందిలే అనుకున్నారు.కాని అసలు విషయం తెలిసిన తర్వాత ఉసూరుమంటారేమో.మెగాస్టార్‌ చిరంజీవికి జోడీగా హీరోయిన్‌ ఎవరు అనేవిషయమై ఇంకా క్లారిటీనే ఇవ్వలేదు.

అతి త్వరలోనే సినిమా షూటింగ్‌లో హీరోయిన్‌ జాయిన్‌ అయ్యే అవకాశం ఉంది.అప్పుడు హీరోయిన్‌పై క్లారిటీ వస్తుంది.

త్రిష అంటూ వార్తలు వచ్చాయి.కాని ఆమెనేనా అనే విషయంపై కొరటాల ఎలాంటి ప్రకటన చేయలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube