తాను ఎవరినైనా నమ్మడంటే వారి కోసం ఏమి చేసేందుకైనా వెనుకాడడు జగన్ అంటూ ఆయన సన్నిహితులు తరుచుగా చెబుతూ ఉంటారు.దాన్ని నిజం చేసేలా గత కొంతకాలంగా తనతో సన్నిహితంగా ఉంటూ రాజకీయంగా అండదండలు అందిస్తున్న మెగా స్టార్ చిరంజీవికి జగన్ రాజ్యసభ సీటు ఇవ్వబోతున్నారనే వార్తలు ఇప్పుడు ఊపందుకున్నాయి.
చిరంజీవి తన సొంత తమ్ముడు పవన్ ను కూడా కాదనుకుని జగన్ కు మద్దతు ఇస్తున్నారు.అంతే కాకుండా జగన్ ను కుటుంబంతో సహా వచ్చి విజయవాడలో కలిసి అనేక విషయాలపై చర్చించారు.
ఆ తరువాత ఓ సినిమా ఫంక్షన్ లో మరోసారి చిరంజీవి జగన్ ను పొగిడారు.
ఇక జగన్ ఇప్పుడు చిరంజీవికి అంత ప్రాధాన్యం ఇవ్వడం వెనుక కారణాలు విశ్లేషిస్తే ఒకవైపు తెలుగుదేశం పార్టీకంటే తీవ్ర స్థాయిలో జనసేన దూసుకువస్తూ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ ఉండడం, కాపు సామాజికవర్గంలో పవన్ కు పట్టు ఎక్కువగా ఉండడంతో ఆలోచనలో పడ్డ జగన్ చిరంజీవిని దగ్గర చేసుకోవడం వల్ల ఆ సామజిక వర్గం లో చీలిక తీసుకురావచ్చని చూస్తున్నట్టు అర్ధం అవుతోంది.
అందులో భాగంగానే చిరంజీవికి రాజ్యసభ సీటు ఇస్తున్నట్టుగా తెలుస్తోంది.