దర్బార్ మూవీ సెన్సార్ పూర్తి... రజినికి కమర్షియల్ హిట్ ఇస్తుందా

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, స్టార్ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దర్బార్.భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కి సిద్ధం అవుతుంది.

 Rajinikanth Darbar Sensar Bord Release Date-TeluguStop.com

ఇక ఇప్పటి వరకు సోషల్ ఎక్స్ పర్మేంట్స్ కథలతో కమర్షియల్ హిట్స్ కొట్టిన మురుగదాస్ ప్రస్తుతం రజినీకాంత్ కోసం ఎలాంటి మెసేజ్ లేని కమర్షియల్ హిట్ ఫార్ములా అయినా మాఫియా స్టొరీని నమ్ముకున్నాడు.ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన టీజర్ ప్రేక్షకుల ముందుకి వచ్చి రికార్డ్ వ్యూస్ సొంతం చేసుకుంది.

రజినీకాంత్ తన ఎనర్జీని ఈ సినిమాలో మరల చూపించబోతున్నాడు.కబాలి, కాలా సినిమాలు చూసి విసిగిపోయిన రజినీకాంత్ ఫాన్స్ కి ఇది ఫుల్ మీల్స్ సినిమా అని చెప్పాలి.

ముంబై మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన దర్బార్ చిత్రంలో రజిని కాంత్ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు.అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.

ఈ చిత్రంలో రజిని కాంత్ సరసన హీరోయిన్ గా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్నారు.జనవరి 9న విడుదల కానున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

U/A సర్టిఫికేట్ ని సెన్సార్ సభ్యులు ఇచ్చారు.ఈ చిత్రం రన్‌ టైమ్ 2 గంటల 39 నిమిషాల అని తెలుస్తోంది.

చాలా కాలం తర్వాత రజినీకాంత్ నుంచి వస్తున్నా కమర్షియల్ సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.దానిని ఈ చిత్రం ఎంత వరకు అందుకుంటుంది అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube