దైవదూషణ చేసినందుకు ప్రొఫెసర్ కి మరణశిక్ష

భారత్లో ఎవరికి హిందూ మతం పైన, హిందూమతంలో పూజించే దేవుళ్ళు పైన ఇష్టారాజ్యంగా విమర్శలు చేస్తూ ఉంటారు.దేవుళ్ల గురించి హేళనగా మాట్లాడతారు.

 Junaid Hafiz Can Pakistani Professor-TeluguStop.com

కొన్ని సందర్భాల్లో మరి శృతి మించి కించపరిచే విధంగా ఫోటోలు పెట్టడం, అదే పనిగా దైవ దూషణకి పాల్పడటం చేస్తూ ఉంటారు.అయితే ఈ స్థాయిలో దైవ దూషణకి పాల్పడిన కూడా వారి మీద ఎలాంటి కేసులు ఉండవు.

ఒకవేళ ఎవరైనా హిందుత్వ సంస్థలకి చెందిన వారు కేసులు పెట్టిన కూడా వాటిని సోకాల్డ్ లౌకికవాదులు పెద్ద రాద్ధాంతం చేస్తు ఉంటారు.భిన్నమతాల దేశంలో సనాతన హిందూ మతంలో ఉన్న దేవుళ్ళ మీద ఎవరు ఎన్ని రకాలుగా విమర్శలు చేసిన చట్టం వారికి ఎలాంటి శిక్షలు వేయదు.

వేసిన కూడా ఏదో నామమాత్రం శిక్షలతో సరిపెడుతుంది.

అయితే ఇస్లామిక్ దేశాలలో దైవదూషణ అనేది చాలా కఠినమైన అపరాధం.

ఎవరైనా ఇస్లామిక్ దేవుడుని కించపరిచే విధంగా మాట్లాడితే ప్రభుత్వమే నేరుగా వారి మీద చర్యలు తీసుకుంటుంది.కేసు నమోదు చేసి ఆధారాలతో సహా రుజువైతే మరణ శిక్ష విధిస్తుంది.

పాకిస్తాన్‌లో ఉన్న దైవ దూషణ చట్టానికి ఇప్పుడు మరొకరు బలయ్యారు.దైవాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేశాడని ఓ ప్రొఫెసర్‌కు శనివారం కోర్టు మరణ శిక్ష విధించింది.2013లో ప్రొఫెసర్‌ జునైద్‌ హఫీజ్‌ ఖాన్‌ ముల్తాన్‌లోని ఓ యూనివర్సిటీలో ప్రసంగిస్తూ దైవదూషణ వ్యాఖ్యలు చేశాడనే ఆరోపణపై కేసు నమోదైంది.అప్పటి నుంచి ప్రొఫెసర్‌ను నిర్భందంలో ఉంచి విచారిస్తున్నారు.

ఈ నేపథ్యంలో విచారణ పూర్తయి శనివారం తీర్పు వెలువడింది.దైవ దూషణ చేసిన నేరానికి అతనికి మరణ శిక్షతో పాటు 5 లక్షల పాకిస్తాన్‌ రూపాయలను కోర్టు జరిమానా విధించింది.

ఇప్పుడు ఈ వ్యవహారం ఆ దేశంలో సంచలనంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube