మీకు తెలుసా... నేటితో నిర్భయ ఘటనకు సరిగ్గా ఏడేళ్లు...!

సరిగ్గా ఏడేళ్ల క్రితం దేశ రాజధాని అయినటువంటి న్యూ ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన దేశ వ్యాప్తంగా ఎంత కలకలం సృష్టించిందో మన అందరికీ బాగా తెలుసు.ఢిల్లీలోని వసంతవిహార్ అనే ప్రాంతంలో ఓ యువతిని మృగాల్లాంటి నలుగురు యువకులు అత్యాచారం చేసి ఆమెను దారుణంగా చిత్ర హింసలకు గురి చేసి మరీ చంపేసారు.

 Latest News About Nirbhayacase-TeluguStop.com

అయితే అప్పట్లో ఆ యువతి మృతదేహాన్ని పోస్టు మార్టం చేసిన డాక్టర్ సైతం ఖంగు తిన్నాడంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆమెను ఎంత పాశవికంగా అత్యాచారం చేశారో అని.

Telugu Delhi, Delhi Latest, Nirbhaya, Nirbhaya Latest-

అత్యాచార అనంతరం పోలీసులు నిందితులను అరెస్ట్ చేసారు.ఇందులో ఒక నిందుతుడు మైనర్ బాలుడని అతడిని కోర్టు విడుదల చేయగా, మరో నిందుతుడు తను ఉంటున్నజైలు గదిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు.మిగిలిన నిందుతులకి శిక్ష అయితే వేశారు కానీ ఆ శిక్షను ఇప్పటికీ అమలు చేయకపోవడంపై కొన్ని ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

అంతేగాక  ఇప్పటికి నిర్భయ ఘటన జరిగి ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఏడూ సంవత్సరాలు గడిచిపోయాయని, ఇంకెప్పుడు నిందితులకు వేసిన శిక్షను అమలు చేస్తారని ప్రభుత్వాన్ని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

అయితే ఇప్పటికే నిర్భయ నిందితులను ఉరి తీసేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

కానీ అది ఎంతవరకూ నిజమనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే తాజాగా నిర్భయ ఘటనపై బాధితురాలి తల్లి మాట్లాడుతూ “నా కూతురిని దారుణంగా అత్యాచారం చేసి చంపేసిన నిందితులకు శిక్ష పడేంత వరకూ పోరాడుతానని అన్నారు.

 అంతేగాక ఇప్పటికే నిందుతులకి వేసిన ఉరి శిక్షను అమలు చేయాల్సిందని అన్నారు.అయినా నాకు ఆ బగవంతునిపై ఇంకా నమ్మకం ఉందని, అలాగే రాష్ట్రంలో నిర్భయ ఘటనలు ఢిల్లీలో మాత్రమే జరగడం లేదని దేశం నలుమూలల జరుగుతున్నాయని కావున మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని” పేర్కొన్నారు.

అయితే ఇది ఇలా ఉండగా హైదరాబాదులో మొన్న జరిగిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి అత్యాచార ఘటనలో నిందితులను ఎన్కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే.అంతేగాక మహిళలపై జరిగే అత్యాచారాలను అరికట్టడానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దిశ యాక్ట్ అనే చట్టం కూడా తీసుకురావడంతో నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరి కొందరైతే మహిళలకు రక్షణ కల్పించే  ఇలాంటి చట్టాలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా దేశంలో అన్ని చోట్ల అమలు చెయ్యాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి సూచిస్తున్నారు.  

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube