కొత్త వ్యాపారం మొదలు పెట్టిన హీరో సందీప్ కిషన్

టాలీవుడ్ లో యువ కథానాయకుడు గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న హీరో సందీప్ కిషన్.పేరులో ఇట్లు కంటే ప్లాప్ సినిమాలు ఎక్కువగా ఉన్న హీరో కూడా అతని చెప్పాలి.

 Sundeep Kishan Forays Into A New Business-TeluguStop.com

అయితే తన కెరీర్లో బాగా గుర్తింపు తీసుకువచ్చిన సినిమాలుగా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, నిను వీడని నీడను నేనే సినిమాలు కమర్షియల్గా కావడంతో పాటు తనకు మంచి ఇమేజ్ ని తీసుకు వచ్చాయి.తెలుగు సినిమాలతోపాటు మరోవైపు తమిళంలో కూడా అప్పుడప్పుడు మెరుస్తున్న సందీప్ కిషన్ సినిమాలతో పాటు వ్యాపారాలు కూడా చేస్తున్నాడు.

ఆ మధ్య కాలంలో హోటల్ బిజినెస్ స్టార్ట్ చేసిన ఈ యువ హీరో తాజాగా మరో వ్యాపారంలోకి అడుగు పెట్టాడు.

రెస్టారెంట్ వ్యాపారం బాగా కలిసి రావడంతో సందీప్ కిషన్ ఇప్పుడు స్టైలిష్ వ్యాపారంలోకి అడుగు పెట్టాడు.

స్టైలిష్ సెలూన్లలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన క్యూబిఎస్ సెలూన్ ఫ్రాంచైజీని సందీప్ కిషన్ తీసుకున్నాడు.త్వరలో ఈ సెలూన్ ప్రారంభించబోతున్నారు.ఇలా వచ్చిన డబ్బుతో నిర్మాతగా కూడా సినిమాలు నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం తన సినిమాలకు మాత్రమే నిర్మాణ భాగస్వామిగా ఉన్న సందీప్ కిషన్ త్వరలో ఇతర హీరోలతో కూడా సినిమాలు నిర్మించే అవకాశం ఉందని తెలుస్తుంది.మరి వివిధ రంగాలలో తన ప్రస్థానం కొనసాగిస్తున్న సందీప్ కిషన్ ఎంతవరకు ముందుకెళ్తాడు అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube