వైరల్‌ వీడియో : ఈ సీఐ రోడ్డుపై ఏం చేస్తున్నాడో చూడండి, ఇలాంటి వారు 10 మంది ఉంటే చాలు

కొందరు ప్రభుత్వ ఉద్యోగులు మరీ లేజీగా ఉంటారు.తమకు సంబంధించిన పనులనే కొందరు సక్కగా చేయరు.

 Hyderabad Traffic Police Wins Hearts By Clearing Waterlogged Road-TeluguStop.com

అలాంటింది కొందరు తకుమ అవసరం లేని పనులు కూడా చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు.అప్పుడు వారిని చూసినప్పుడు అబ్బ ఇలాంటి వారు నగరానికి ఒక పది మంది ఉంటే ఎంత బాగుంటుంది కదా అనిపిస్తుంది.

అలాంటి ఒక సీఐ గురించి ఇప్పుడు మీకు చూపిస్తాను.ఈయన ప్రస్తుతం సోషల్‌ మీడియాలో సెన్షేషనల్‌ అయ్యాడు.

ఈయనది ఎక్కడో కాదు మన హైదరాబాద్‌.ఈయన ఏదో సాదారణ కానిస్టేబుల్‌ కాదు.ఒక సీఐ అంటే సర్కిల్‌ ఇన్సిపెక్టర్లు.ఈయన కింద చాలా మంది ఎస్సైలు కానిస్టేబుల్స్‌ ఉంటారనే విషయం తెల్సిందే.అయినా కూడా ఆయన ఈ పనిని మరెవ్వరికో చెప్పకుండా స్వయంగా తానే చేశాడు.దాంతో ఇప్పుడు ఈయన రియల్‌ హీరో అయ్యాడు.

నిజంగా నువ్వు గ్రేట్‌ సర్‌ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.నీవు చేసిన పనిని చూసి ఇతర పోలీసులు తల దించుకోవాలి అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇంతకు ఈ సీఐ ఏం చేశారంటే రోడ్డుపై ఉన్న నీటి వల్ల ట్రాఫిక్‌ ఇబ్బంది ఎదురవుతుండటంతో ఆ నీటిని తోడి పక్కఉ పోశాడు.జీహెచ్‌ ఎంసీ వారు లేదంటే ఆర్‌అండ్‌ బీ వారు చేయాల్సిన పనిని ఈయన చేయడం నిజయంగా అభినందనీయం.ఎంతో మంది రోడ్డుపై వెళ్తుండా ఈయన నీరు ఎత్తి పోశాడు.మొదట ఎవరో కానిస్టేబుల్‌ లేదా హోం గార్డ్‌ అయ్యి ఉంటాడు అనుకున్నారు.

కాని ఇతడు సీఐ అని తెలిసిన తర్వాత అంతా అవాక్కవుతున్నారు.రాచకొండ సీఐ నాగమల్లు ఈయన.గతంలో కూడా ఈయన తన పద్దతితో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెల్సిందే.ఇంత గొప్ప పని చేస్తే కొందరు మాత్రం ఈయన్ను పబ్లిసిటీ కోసం చేస్తున్నాడు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube