అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి అమెరికాలోని ప్రఖ్యాత యూనివర్సిటీ లు అన్నీ కలిసి ఓ లేఖని సంధించాయి.ఇమ్మిగ్రేషన్ విధానంలో మీరు తీసుకువస్తున్న కటినమైన మార్పులని గనుకా సవరించకపోతే అమెరికా ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని.
సుమారు 60 యూనివర్సిటీలకి చెందిన డీన్ లు , సీఈవో లు ట్రంప్ కి లేఖ రాశారు.హెచ్ 1 బి వీసాల విషయంలో విధించిన నిభంధనలని తొలగించాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
అమెరికాలో దాదాపు 30 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని, అయితే ఈ విధానాల వలన విదేశాల నుంచీ వస్తున్న గొప్ప మేధావులని మనం కోల్పోతున్నామని దాంతో ఈ ఉద్యోగాల భర్తీ పూరించలేకపోతున్నామని వారు వివరించారు.ఒక వేళ ఈ భర్తీ గనుకా నిపుణుల తో చేపట్టకపొతే మాత్రం తీవ్ర సంక్షోభం ఎదుర్కోవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు.

గత సంవత్సరం సుమారు 1.95 లక్షల వీసాలు ఇస్తే ఈ సంవత్సరం మాత్రం కేవలం 85 వేల వీసాలు ఇవ్వడంతోనే పరిణామాలు తీవ్రంగా ఉండేలా ఉంటాయని అంటున్నారు.అందుకే ఇమ్మిగ్రేషన్ విధానంలో భారీ మార్పులు గనుకా తీసుకురాకపోతే నష్టం తీవ్రతరమవుతుందని, అందుకే వీసా జారీ విషయంలో మార్పు తీసుకురావాలని సూచించారు.