రౌడి స్టార్ విజయ్ దేవరకొండ కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా ఒకేసారి నాలుగు భాషల్లో తన సినిమాను రిలీజ్ చేశాడు.తెలుగు తమిళ్ కన్నడ మలయాళం భాషల్లో గ్రాండ్ గా రిలీజైన డియర్ కామ్రేడ్ మిక్సీడ్ రిపోర్ట్స్ తో కలెక్షన్స్ ని అందుకుంటోంది.
గీత గోవిందం అనంతరం రష్మీక మందన్న విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన ఈ సినిమాపై మొదటి నుంచి పాజిటివ్ బజ్ ఉంది.
దీంతో మొదటిరోజు సాలీడ్ ఓపెనింగ్స్ అందాయి.మిగతా భాషల్లో చెప్పుకోదగ్గ కలెక్షన్స్ ఏమి రాలేవని తెలుస్తోంది.అయితే తెలుగులో మాత్రం విజయ్ కెరీర్ లొనే ది బెస్ట్ ఓపెనింగ్స్ అందినట్లు సమాచారం.డియర్ కామ్రేడ్ తెలుగు లాంగ్వేజ్ లో వరల్డ్ వైడ్ గా 9.25కోట్ల షేర్స్ ని రాబట్టినట్లు సమాచారం.అయితే కొన్ని రివ్యూలు పాజిటివ్ గా రాగా మరికొన్ని నెగిటివ్ గా వచ్చాయి.
రివ్యూలు సంగతి ఎలా ఉన్నా రౌడి స్టార్ మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద గట్టి లాబాలనే అందుకుంటున్నాడు.శనివారం ఆదివారం ఫ్రీ బుకింగ్స్ డోస్ కూడా పెరిగింది.ఇదే ఫ్లోలో కలెక్షన్స్ కొనసాగితే వీకెండ్ ముగిసేసరికి సినిమా 20కోట్లకు పైగా షేర్స్ ని అందించే అవకాశం ఉంది.
మరి ఈ సారి విజయ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు అందుకుంటాడో చూడాలి.