అదేంటి బీజేపీ నేత సోము వీర్రాజు కు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆఫర్ ఇవ్వడం ఏంటి అని అనుకుంటున్నారా.నిజంగానే బుద్ధా వీర్రాజు కు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు.
ఇటీవల మొదలైన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అధికార వైసీపీ,టీడీపీ పార్టీల మధ్య కురుక్షేత్రమే జరుగుతున్న సంగతి తెలిసిందే.అయితే ఈ సమావేశాల్లో బీజేపీ పార్టీ కూడా పాల్గొన్నప్పటికీ పెద్దగా ఆ పార్టీ సభ్యులు ఎవరూ కనిపించక పోయినప్పటికీ మండలి స్థాయి లో సభ్యులు మాత్రమే ఉన్నారు.
అసెంబ్లీ లాబీలో టిడిపి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న బిజెపి నేత సోము వీర్రాజు ఎదురుపడ్డారు.ఈ క్రమంలోనే మీ పార్టీ వాళ్లంతా మా పార్టీలో చేరుతున్నారు మీరు ఇప్పుడు టిడిపిలో ఉండి ఏం ? సాధిస్తారు బిజెపిలో చేరాలని వీర్రాజు ఆహ్వానించారు.
అయితే దానికి బుద్దా వెంకన్న రివర్స్ పంచ్ ఇచ్చారు.మీరే మాతో కలిసి పనిచేయండి.టీడీపీ ప్రభుత్వం వచ్చాక కేబినెట్ లోకి తీసుకుంటాం’ అని చెప్పారు.ఈ సందర్భంగా ఇద్దరు నేతలు కొద్దిసేపు మాట్లాడుకుని అక్కడ నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తుంది.