కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దాదాపు సంవత్సరం క్రితం ‘ఇండియన్ 2’ చిత్రం ప్రారంభం అయిన విషయం తెల్సిందే.అయితే ఏవో కారణాల వల్ల సినిమా వాయిదాలు పడుతూ వచ్చింది.
వరుస వాయిదాల నేపథ్యంలో అనేక పుకార్లు ఈ చిత్రం ఆగిపోయిందంటూ ప్రచారం చేయడం జరిగింది.నిర్మాణ వ్యయం మరీ ఎక్కువ అవుతున్న కారణంగా ఇండియన్ 2 ను ఆపేశారు అంటూ ప్రచారం జరిగింది.
ఆ విషయమై చిత్ర యూనిట్ సభ్యులు స్పందించక పోవడంతో నిజమేనేమో అనుకున్నారు.కాని తాజాగా క్లారిటీ వచ్చేసింది.
ఇండియన్ 2 కోసం కాస్టింగ్ కాల్‌కు ప్రకటన వచ్చింది.నటీనటులు కావాలి అంటూ చిత్ర యూనిట్ సభ్యులు ఇచ్చిన ప్రకటనతో సినిమా మళ్లీ లైన్‌లో పడబోతుంది అంటూ క్లారిటీ వచ్చేసింది.ఇన్నాళ్లు కమల్ రాజకీయాలు మరియు ఇతరత్ర కారణాల వల్ల సినిమాలకు దూరంగా ఉన్నాడు.మళ్లీ ఇప్పుడు బిగ్‌బాస్‌తో బిజీగా ఉన్నాడు.బిగ్‌బాస్ చేస్తున్నా కూడా తప్పకుండా శంకర్ కు డేట్లు ఇచ్చేందుకు సిద్దం అయినట్లుగా తెలుస్తోంది.ఆగస్టులో ఇండియన్ 2 చిత్రం కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది.
ఈ చిత్రంలో ఒక హీరోయిన్‌గా కాజల్‌ను ఎంపిక చేయడం జరిగింది.అయితే తాజాగా ఈ చిత్రంకు గాను మరో హీరోయిన్‌గా రకుల్‌ను ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.దాంతో కాజల్ తప్పుకుంటే రకుల్ ఎంట్రీ ఇచ్చిందని అంతా అనుకున్నారు.కాని విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం కాజల్ మరియు రకుల్ లు ఇద్దరు కూడా ఉండబోతున్నారు.
వీరిద్దరితో పాటు ఇంకా పలువురు ప్రముఖ నటీనటులు కూడా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు.