టాలీవుడ్ హీరోయిన్ రెజీనాపై గత కొద్ది రోజులుగా ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి.ప్రస్తుత సినిమా అవకాశాలు లేకపోవడంతో ఖాళీగా ఉన్న రెజీనా ఓ ఎన్నారై వ్యక్తితో పెళ్లికి రెడీ అయిందని, ఇప్పటికే నిశ్చితార్థం కూడా జరిగిపోయిందని వార్తలు వినిపించాయి.
ఇక తాజాగా కొన్ని మీడియా సంస్థలు రెజీనాకి నిశ్చితార్థం అయిపోయిందని ఏకంగా నిర్ధారించేసాయి.ఇక ఆమె ఈ నెల 13వ తేదీన కుటుంబ సభ్యులు సన్నిహితులు సమక్షంలో లో నిశ్చితార్థం జరుపుకుందని వచ్చే యేడాది వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతుందని ఆసక్తికర కథనాలు వినిపించాయి.
అయితే తాజాగా ఈ తమిళ్ బ్యూటీ తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చింది.తన పెళ్లి గురించి గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న వార్తలు పెద్దగా పట్టించుకోకూడదు అనుకున్నా అంతకంతకూ పెరిగిపోతుండడంతో కాస్త అసహనం అనిపించి వీటికి ఫుల్ స్టాప్ పెట్టి పెట్టాల్సి వస్తుందని చెప్పుకొచ్చింది.
తన పెళ్లిపై వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, తాను ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచనలో కూడా తనకు లేదని రెజినా కాసాండ్రా క్లారిటీ ఇచ్చింది.దీంతో ఎన్నో రోజులుగా రెజీనా పెళ్లి గురించి జరుగుతున్న ప్రచారం కాస్త మీడియా సృష్టి అని అర్థమైంది.