పార్లమెంట్ సమావేశాల సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యవహరించే తీరు ఒక్కోసారి వివాదాస్పద మౌతున్న సంగతి తెలిసిందే.గతంలో సభలో ప్రధాని నరేంద్రమోడీ ని హగ్ చేసుకోవడం వివాదాస్పదం కాగా, ఇప్పుడు తాజాగా రాహుల్ మరో వివాదంలో చిక్కుకున్నారు.
పార్లమెంట్ ఉభయసభలను ఉద్దే శించి రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ప్రసంగిస్తున్న సమయంలో రాహుల్ వ్యవహరించిన తీరు వివాదం రేపింది.ఒకపక్క రాష్ట్రపతి ప్రసంగిస్తున్న సమయంలో, రాహుల్ తన సెల్‌ఫోన్ చూస్తూ కూర్చోవడం తో ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
నవ భారత నిర్మాణం దిశగా ముందడుగు వేద్దామంటూ రాష్ట్రపతి మాట్లాడుతున్న సమయంలో రాహుల్ తన మొబైల్లో ఏదో చూస్తుండిపోయారు.
ఇందుకు సంబంధించిన వీడియోను బీజేపీ కిసాన్ మోర్చా తన ట్విటర్ ఖాతా లో పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది.
దీనితో సభ లో రాష్ట్రపతి ప్రసంగానికి కూడా గౌరవం ఇవ్వకుండా ఇలా ఫోన్ చూస్తూ కూర్చోవడం తో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.పార్లమెంట్లో ఎలా వ్యవహరించాలో కూడా తెలీదా అంటూ పలువురు మండిపడుతున్నారు.
గతంలో కూడా రాహుల్ పార్లమెంట్ సమావేశాల సమయంలో ఎదో ఒక చర్య తో వార్తలలో నిలిచేవారు.అయితే ఇప్పుడు తాజాగా రాష్ట్రపతి ప్రసంగం సమయంలో ఈ విధంగా వ్యవహరించి మరోసారి సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారారు.