ఎస్ సీ వో సదస్సు వేదికగా పరోక్షంగా పాక్ కు చురకలు అంటించిన మోడీ

భారత ప్రధాని నరేంద్ర మోడీ పొరుగుదేశం పాకిస్థాన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు.కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ లో జరిగిన సాంఘై సహకార సదస్సులో పాల్గొన్న ప్రధాని ఈ సందర్భంగా పాక్ కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

 Narendra Modi Gave Warning To Pakistan In Sco Summit-TeluguStop.com

ఈ సమావేశంలో పాల్గొన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎదుటే పరోక్షంగా ఆ దేశానికి మోడీ చురకలు అంటించారు.భారత్ ను ఎదుర్కొనేందుకు ఒక దేశం గత కొన్ని దశాబ్దాలు గా ఉగ్రవాదాన్ని పెంచి పోషిండమే తన విధానంగా మార్చుకుందని,ఉగ్రపీడను వదిలించేందుకు అన్ని దేశాలు కలిసికట్టుగా రావాలి అంటూ మోడీ పరోక్షంగా పాక్ కు చురకలు అంటిస్తూ ఎస్ సి వో దేశాలకు పిలుపు నిచ్చారు.

ఎస్ సీ వో సదస్సు వేదికగా పరోక్

అలానే ఈ సమావేశంలో పాల్గొన్న దేశాలకు మోడీ హెల్త్ మంత్రాన్ని కూడా చెప్పారు.HEALTH లో ఒక్క అక్షరానికి ఒక్కో అర్ధం ఉందని, H అంటే హెల్త్ అండ్ మెడికేర్ అని E అంటే ఎకో అని, A అంటే ఆల్టర్నెట్ కనెక్టవిటీ, L అంటే లిటరేచర్ T అంటే టెర్రరిజం ఫ్రీ సొసైటీ, H అంటే హ్యుమానిటీ అని కొత్త అర్ధాన్ని ఎస్ సీవో సభ్య దేశాలకు మోడీ అందించారు.ఉగ్రవాద రహిత దేశానికి భారత్ కట్టుబడి ఉందని, ఇలా ప్రపంచ దేశాలు పరస్పరం సహకారం అందించుకోవాలని మోదీ పిలుపునిచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube