మరుగుజ్జుల గ్రామం.. ఈ గ్రామంలో అందరూ మరుగుజ్జులే , ఆ గ్రామం గురించి మీకు తెలియని కొన్ని విషయాలు...

మరుగుజ్జు (Dwarf) అనగా పొట్టి ఆకారం గల మనిషి.ఒక వ్యక్తి యొక్క ఇలాంటి స్థితిని మరుగుజ్జుతనం (Dwarfism) అంటారు.

 The Mysterious Dwarf Village Of China-TeluguStop.com

ఎవరైనా యవ్వనంలో 4 అడుగుల 10 అంగుళాల ఎత్తుకంటే తక్కువ ఎత్తు ఉంటే వారిని మరుగుజ్జు అని అంటారు.మరుగుజ్జు తనం కలగడానికి చాలా వివిధ కారణాలున్నాయి.

కానీ అకాండ్రోప్లేసియా, గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ అనేది ప్రధాన కారణం.అసలు విషయానికొస్తే చైనాలోని ఒక గ్రామం లో దాదాపు 50 శాతం జనాభా మరుగుజ్జులే ఉన్నారు.

ఆ గ్రామం గురించి మీకు తెలియని కొన్ని విషయాలు.

చైనా లోని యంగ్సి అనే గ్రామంలోని జనాభాలో సగం శాతం మంది మరుగుజ్జులే ఉంటారు.ఆ మరుగుజ్జులందరు వేరే ప్రదేశం నుండి వచ్చి ఆ గ్రామంలో నివసించట్లేదు.అందరూ వారి పూర్వీకుల నుండి అక్కడే నివసిస్తున్నారు.

మాములుగా మరుగుజ్జులు మనకి చాలా మందిలో ఒకరు కనిపిస్తారు , కానీ ఒకే గ్రామంలో దాదాపు 80 మంది వరకు మరుగుజ్జులు ఉన్నారు.సైన్స్ ప్రకారం మరుగుజ్జు తనం 20,000 మందిలో ఒకరికి మాత్రమే వస్తుందట.

ఇటువంటి గ్రామం ఉంది అని చెప్పుకోడానికి ఎప్పుడు చైనా సందేహపడదు.ఈ గ్రామాన్ని చూడటానికి విదేశీయులు వస్తే అనుమతి కూడా ఇస్తుంది.

ఆ గ్రామం లో ఎక్కువగా మరుగుజ్జులు పుట్టడానికి కారణాలు

యంగ్సి గ్రామానికి వచ్చిన కొంత మంది సైంటిస్ట్ లు అసలు ఒకే గ్రామంలో అంతమంది మరుగుజ్జు లు ఎలా జన్మించారో తెలుసుకోవడానికి చాలా ప్రయత్నించారు కానీ వారి పరిశోధనలో ఎటు వంటి ఆధారాలు దొరకలేదు .ఆ గ్రామంలో ని మట్టిలో ఎక్కువగా మెర్క్యూరీ ఉండడం వల్ల పుట్టే పిల్లల ఎత్తు పెరగడం లేదని భావించారు కానీ దానికి ఎటువంటి ఆధారం లేదు.అక్కడి గ్రామ ప్రజలని అడిగినప్పుడు 1950 ఆ కాలం లో ఊర్లో చాలా మందికి వివిధ రకాల రోగాలు వచ్చాయని అప్పటినుండి తమ పిల్లల ఎత్తు పెరగడం ఆగిపోయిందని తెలిపారు.ప్రస్తుతం ఆ గ్రామంలో ఎక్కువగా మరుగుజ్జు లు ముసలి వారే.

గత కొన్ని సంవత్సరాల క్రితం నుండి పుడుతున్న పిల్లలకి ఎటువంటి మరుగుజ్జు లక్షణాలు కనిపించట్లేదట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube