టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై క్రైస్తవ మత బోధకుడు కేఏ పాల్ విరుచుకుపడ్డాడు.గత కొంతకాలంగా….
టీడీపీ, వైసీపీ మీద ఆరోపణలు చేస్తూ… తాను అధికారంలోకి రాబోతున్నట్టు పలు మీడియా ఛానెల్స్ లో ప్రకటిస్తున్నాడు పాల్.అయితే తాజాగా…సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్పై విమర్శలు గుపించారు.
చంద్రబాబు, జగన్ లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.చంద్రబాబు ఇటీవలి ఢిల్లీ పర్యటనలో ఒక్క నేత కూడా కలవలేదని దీంతో టీడీపీ అంతం మొదలయినట్టేనని ఆయన అన్నారు.
ఈ విషయం టీడీపీకి కూడా తెలిసిపోయిందని, ఈ ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు కూడా దక్కవన్నారు.దేవుడికి చంద్రబాబుపై కోపం వచ్చిందని, అనాథలకు, వితంతువులకు ఆయన విరుధ్ధంగా ఉన్నారని విమర్శించారు.గురువునైన తనపైనే కుట్రలు చేశారని, ఇక చంద్రబాబును దేవుడు కూడా క్షమించరని పాల్ హెచ్చరించారు.