తేజూ మళ్లీ ఈ రచ్చ అవసరమా? బాబు ఇకనైనా పంతం వీడవా?

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 2లో అత్యధిక అంచనాల నడుమ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ తేజస్వి.ఈమె సునాయాసంగా ఫైనల్‌కు చేరుకుంటుందని, ఈమెకు ఉన్న ఫాలోయింగ్‌తో ఈజీగా ఎలిమినేషన్స్‌ నుండి బయట పడటం ఖాయం అంటూ అంతా అనుకున్నారు.

 Kaushal Army Targets Tejaswini And Babu Gogineni Again-TeluguStop.com

కాని అనూహ్యంగా ఇంట్లోకి వెళ్లిన తర్వాత పరిస్థితి మారిపోయింది.ఆమెలోని కాస్త అతి గుణం కారణంగా ఆమెను అభిమానించే వారు కూడా తిరష్కరించడం మొదలు పెట్టారు.

తానో పెద్ద సెలబ్రెటీని అంటూ ఫీల్‌ అవుతూ ఇంట్లూ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించిన కారణంగా తేజస్వి కేవలం సగం రోజుల్లోనే బయటకు వచ్చేసింది.తేజస్వి బయటకు వెళ్లడానికి ప్రధాన కారణం కౌశల్‌తో గొడవ పడటం అంటూ ఎక్కువ శాతం జనాలు అంటున్నారు.కౌశల్‌ ఆర్మీ తల్చుకోవడం వల్లే తేజస్వి ఎలిమినేట్‌ అయ్యింది అంటూ సోషల్‌ మీడియాలో టాక్‌ వినిపించింది.ఆ కోపమో ఏమో కాని తాజాగా తేజూ తాజాగా లోనికి వెళ్లిన సమయంలో కౌశల్‌తో పెద్దగా మాట్లాడలేదు.

ఇంటి సభ్యులందరికి కూడా హగ్‌ ఇచ్చిన తేజస్వి కౌశల్‌కు మాత్రం షేక్‌హ్యాండ్‌ ఇచ్చింది.

తేజస్వికి ఇంకా కౌశల్‌పై కోపం ఉన్నట్లుగానే ఉంది అంటూ సోషల్‌ మీడియాలో టాక్‌వినిపిస్తుంది.మరోవైపు బాబు గోగినేని కూడా బిగ్‌ బాస్‌ రీ యూనియన్‌ సందర్బంగా ఇంట్లోకి వెళ్లడం జరిగింది.ఆ సమయంలో కౌశల్‌తో అంటీ ముట్టనట్లుగా వ్యవహరించాడు.

కౌశల్‌ స్వయంగా వెళ్లి షేక్‌ హ్యాండ్‌ ఇవ్వగా ఏదో మొహమాటం కొద్ది తాను షేక్‌ హ్యాండ్‌ ఇచ్చాడు.అంతే తప్ప మనస్ఫూర్తిగా ఇవ్వలేదు.

దీంతో సోషల్‌ మీడియాలో కౌశల్‌ ఆర్మీ మరోసారి వీరిద్దరిని టార్గెట్‌ చేస్తున్నారు.ఎలిమినేట్‌ అయిన తర్వాత కూడా తేజస్వి గేమ్‌ ఆడుతున్నట్లుగా ఫీల్‌ అయ్యిందని అంటున్నారు.

ఇక బాబు కాస్త ఈగో తగ్గించుకుని పంతం వీడితే బాగుండేది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube