సోషల్ మీడియా అంటే మనం చేసే ప్రతీ పనిని ప్రపంచానికి చూపించేస్తుంది…ఏ మాత్రం ఆదమరచి ఉన్నా సరే క్షానాల్లో లక్షణ మందికి మన గుట్టు తెలిసిపోయే ప్రమాదం ఉంటుంది.అయితే ఇది తప్పు చేసేవాళ్ళు మాత్రమే భయపడాల్సిన విషయం అయితే ఎవరి పర్సనల్ విషయాలు వారికి ఉంటాయి.
కానీ అవి పబ్లిక్ అవ్వకూడదు.అవగాహనా రాహిత్యమో లేక అనుకోకుండా జరిగిపోవడంవలనో ఎంతో మంది పెద్ద మనుషులు పరువులు పోగొట్టుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి.
అయితే తాజాగా జరిగిన ఇలాంటి సంఘటన టిడిపి నాయకుడిని ఇబ్బందుల్లోకి నెట్టింది.
సోషల్ మీడియాలో ఒక వార్తా రాగానే నలుగురికి షేర్ చేస్తున్నారు.
ఇక వాట్సప్ వచ్చాక ఈ షేరింగ్ గోల బాగా ముదిరిపోయింది.గ్రూపుల వారీగా వచ్చిన సందేశాన్ని మరికొందరికి షేర్ చేస్తే కానీ కొందరికి నిద్రపట్టదు.
ఈ వాట్సప్ గ్రూపుల్లో అనేక రకాలు ఉంటాయి…అయితే ఒక గ్రూపులో పోస్ట్ చేయాల్సింది.వేరే గ్రూపులో పోస్టు చేస్తేనే కొంపలు మనిగిపోతాయి.
ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలో అదే జరిగింది.ఓ టీడీపీ నేత ఓ బూతు వీడియోను మరో గ్రూపులో పోస్ట్ చేశారట.
ఇప్పుడు ఇదే ఏపీలో హాట్ టాపిక్ అయ్యింది.
ఒక్క షేర్ ఒక్క రాంగ్ పోస్టింగ్ తో పరువు కాస్తా పాయె అన్నట్టుగా అయ్యింది సదరు నాయకుడి పరిస్థతి.
ఆ ద్రురదృష్ట నాయకుడు ఎవరో అని అనుకుంటున్నారా…పెద్దాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ కోరిపూరి రాజు.అయితే ఈ విషయం పై ఆయన వివరణ కూడా ఇచ్చారు…అది తాను పోస్టు చేయలేదని.
తన పిల్లలు పొరపాటు దానిని పోస్టు చేశారని ఆయన చెప్పారు.అది తెలియకుండా జరిగింది అని చెప్పారు.
ఎంత చెప్పినా ఫలితం ఏముంటుంది చెప్పండి ఇప్పటికే ఫలానా పార్టీ నేత ఇలా చేశాడు అంటూ రచ్చ రచ్చ జరిగిపోతోంది.అందుకే సోషల్ మీడియాతో జర జాగ్రత్త అంటున్నారు.