1.స్ట్రాబెర్రీ మరియు తేనే స్క్రబ్
స్ట్రాబెర్రీలలో యాంటి ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన చర్మ ఆరోగ్యానికే కాకుండా మొత్తం ఆరోగ్యానికి సహాయపడుతుంది.తేనే మరింత సమర్ధవంతంగా పనిచేస్తుంది.ఈ రెండు సహజ పదార్దాలు చర్మం కోసం ఉపయోగకరంగా ఉంటాయి.
పద్దతి
ఒక కప్పు స్ట్రాబెర్రిలను తీసుకోని మెత్తని పేస్ట్ గా తయారుచేయాలి.దానిలో కొన్ని స్పూన్ల తేనే,కొంచెం పంచదార కలపాలి.ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసి ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.
2.వోట్స్ మరియు ఆలివ్ నూనె స్క్రబ్
వోట్స్ లో మృదుత్వ లక్షణాలు ఉండుట వలన చనిపోయిన చర్మ కణాలను స్క్రబింగ్ చేయటంలో సహాయపడుతుంది.అంతేకాక చర్మాన్ని తేమగా ఉంచుతుంది.
పద్దతి
ఒక బౌల్ లో పావు కప్పు ఉడికించని వోట్స్, ఒక స్పూన్ తేనే,కొన్ని చుక్కల ఆలివ్ నూనె వేసి బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఆరిన తర్వాత శుభ్రం చేయాలి.
3.సముద్ర ఉప్పు మరియు జోజోబా నూనె స్క్రబ్
సముద్రపు ఉప్పులో ఉండే ఖనిజాలు కణాల పెరుగుదలను ఉత్తేజపరచటమే కాకుండా చర్మంలో తేమ ఉండేలా చేస్తాయి.
పద్దతి
సముద్ర ఉప్పులో కొన్ని చుక్కల జొజోబా నూనెను కలిపి ముఖానికి రాసి వృత్తాకార మోషన్ లో మసాజ్ చేస్తే చర్మంపై ఉన్న మృత కణాలు తొలగిపోతాయి.ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
4.కొబ్బరి నూనె మరియు పంచదార స్క్రబ్
కొబ్బరి నూనెలో చర్మానికి పోషణ మరియు తేమను కలిగించే గుణాలు ఉన్నాయి.కొబ్బరి నూనెతో పాటు గ్రాన్యులేటెడ్ పంచదారను ఉపయోగించండి.
పద్దతి
ఒక బౌల్ లో ఒక స్పూన్ కొబ్బరి నూనె, రెండు స్పూన్ల పంచదార కలపాలి.ఈ మిశ్రమంతో మెడ, మరియు ముఖం మీద వృత్తాకార మోషన్ లో మసాజ్ చేస్తే మృత కణాలు తొలగిపోతాయి.ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.