ఇంటిలో ఆడపిల్ల పుడితే లక్ష్మి దేవి ఇంటికి వచ్చిందని సంబరపడతాం.ఆమె కారణంగా పుట్టింటికి లక్ష్మి ఆశీర్వాదం కలుగుతుంది.
ఆమె మెట్టినింటికి వెళ్లిన ఆమెను ఇంటిలో జరిగే శుభకార్యాలకు, పండుగలకు పిలిచి మర్యాద చేస్తూ ఉంటారు.ఆడపిల్ల ఎప్పుడు పుట్టింటి మీద మమకారంతోనే ఉంటుంది.
అందువల్ల ఆమెను ఇంటికి పిలిచి మంగళకరమైన వస్త్రాలు,ఒడిబియ్యం పోయటం ఆచారంగా ఏర్పడింది.అయితే ఒడిబియ్యం పోయటంలో అనేక సంప్రదాయాలు ఉన్నాయి.కొన్ని ప్రాంతాల్లో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒడిబియ్యం పోయాలని ఉంది.పుట్టింటి నుండి వచ్చే వస్త్రాలు,పసుపు,కుంకుమ,గాజులు అనేవి స్త్రీకి సౌభాగ్యాన్ని ఇస్తాయి.
అంతేకాక ఇరు కుటుంబాల మధ్య స్నేహపూరిత వాతావరణం మరియు మంచి సంబంధాలు నెలకొంటాయి.