పిల్లలకు పాలు పడుతున్నప్పుడు ఈ ఆహరం వద్దు

పసిపిల్లలకు తల్లిపాలే ఆహారం, అమృతం.అయితే దాన్ని చెడు అలవాట్లతో విషంగా మార్చకూడదని మనందరికి తెలిసిందే.

 Foods Not To Be Taken While Breastfeeding-TeluguStop.com

సిగరెట్లు, మద్యం .ఇలాంటి అలవాట్లు మానెయ్యాలని కొత్తగా చెప్పనక్కరలేదు.అయితే చాలామంది ఊహించని విధంగా కొన్ని ఆహారపదార్థాలు పాలుపట్టే తల్లులు తీసుకోకపోవడమే మంచిది.అవేటంటే ….

* సిట్రస్ ఫలాలు పాలు పట్టే తల్లులు తీసుకోకపోతే మేలు.ఎందుకంటే పిల్లల GI అప్పటికి ఇంకా ఎదిగి ఉండదు.

నారింజ లాంటి సిట్రస్ ఫలాలలో ఉండే కొన్ని లక్షణాలు ఈ కారణంగా పిల్లలకి చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి.అలా అనిపిస్తే ఇంకేముంది .వెంటనే ఏడుపందుకుంటారు.

* పాలు పడుతున్న తల్లి కాఫీ కూడా తాగకూడదు.

ఎందుకంటే కెఫైన్ ని తల్లి శరీరం బాగానే తీసుకుంటుంది కాని, పసివారి శరీరం ఇంకా కెఫైన్ ని తీసుకునేందుకు సిద్ధంగా ఉండదు.

* చాకొలెట్లు కూడా పసిపిల్లలకి సరిగా పడవని పరిశోధనలు చెబుతున్నాయి.

తల్లి చాకోలేట్ తిన్నాక పాలిస్తే, ఆ తరువాత బిడ్డ ఏడ్చినా, మలవిసర్జన చేసినా, చాకొలెట్లు తినడం ఆపేయ్యాల్సిందే.

* అన్నిరకాల చేపలు పిల్లలకి మంచివి కావు.

కాబట్టి ఎలాంటి సీ ఫుడ్ తీసుకోవాలో డాక్టర్ ని అడగాలి.

* పాలు పట్టే సమయంలో పార్స్లీ తినటం కూడా మంచిది కాదు.

ఇది పాల విడుదలని తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.అంటే తల్లి ఇచ్చే పాలు బిడ్టకి సరిపోకపోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube