పిరియడ్స్ లో ఉన్నప్పుడు అమ్మాయిల్లో శారీరకంగా, మానసికంగా చాలా మార్పులు వస్తాయి.అప్పుడు అబ్బాయిలు చేసే కొన్ని విషయాలు వారికి నచ్చవు.
గట్టిగా కొన్ని మాటలు చెప్పాలనుకుంటారు.కొందరు చెప్పాలనుకున్నా బయటకి చెప్పలేరు, మనసులోనే తిట్టేసుకుంటారు.
అవేంటో చుద్దాం.
* రక్తం ఎందుకు వస్తుంది, ఎందుకు వస్తుంది అని పదే పదే అడుగుతారు ఏంటి ఈ అబ్బాయిలు.
ఇంట్లో వాళ్ళ అమ్మ, చెల్లికి ఇదంతా జరుగుతుంది కదా.అప్పుడు రాలేదా ఈ డౌట్లు.ఎన్నిసార్లు చెప్పాలి, గూగుల్ చేయొచ్చుగా.
* కొన్నిసార్లు పిరియడ్స్ లో కూడా మూడ్ వస్తుంది.
అప్పుడు శృంగారం కావాలంటాను.అలాగని పీరియడ్స్ లో ప్రతీసారి మూడ్ రావాలని కాదుగా.
అర్థం చేసుకోరేంటి.
* నా బట్టలు నేను పిండుకోవడానికే ఇబ్బందిగా ఉంది.
నేను పిరియడ్స్ లో ఉన్నప్పుడైనా తన బట్టలు తాను పిండుకోవచ్చుగా.
* ప్రతి చిన్న విషయానికి హర్ట్ అవుతాడేంటి.
నా కొపమంతా కావాలని తనమీద తీసినట్టు.
* మూడ్ బాగాలెన్నప్పుడే వచ్చి తిట్లు తింటాడు.కాసేపు కామ్ గా కూర్చోవచ్చుగా.
* కాసేపు ఏదైనా మాట్లాడించవచ్చు కదా.ఎంతసేపు ఆ టీవీకి అతుక్కుపోతాడు.
* నువ్వు ట్రై చేస్తే మాత్రం మూడ్ రావాలా? రాకపోతే ఇష్టం తగ్గపోయినట్టా? అసలేమైనా లాజిక్ ఉందా దీంట్లో?
* ఈ టైమ్ లో కూడా ఇంటిపనుల్లో సాహాయం చేయడు.ఏం మనిషో ఏంటో !
ఇలా ప్రతి అమ్మాయి తిట్టుకుంటుంది.కొందరు బయటకి తిడతారు.కొందరు లోలోపలే తిడతారు.కాబట్టి జాగ్రత్తగా మెదలండి అబ్బాయిలు.