అస్సాంలో అధికారం బీజేపీదేనా?

అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రావడానికి మరో అయిదు రోజులే మిగిలాయి.అధికారం దక్కేది బీజేపీకా? కాంగ్రెసుకా?… ప్రజలకు, నాయకులకు ఆత్రుతగా ఉంది.ఎన్నికల సమయంలో ఇది సహజం.అందుకే మీడియా సంస్థలు ఎన్నికలు ప్రారంభమై ముగిసేలోగా సర్వేలు చేసి, ప్రజాభిప్రాయం సేకరించి కొందరికి ఆశ, కొందరికి నిరాశ కలిగిస్తుంటాయి.మీడియా సంస్థలు చేసిన ప్రీ పోల్ సర్వేలో బీజేపీ కూటమి ఆధిక్యంలో ఉంది.

 Will Bjp Win In Assam?-TeluguStop.com

నాలుగు మీడియా సంస్థలు ప్రీ పోల్ సర్వే చేయగా అన్నటిలోనూ బీజేపీకి ఆధిక్యం లభించింది.

ఇండియా టీవీ – సి ఓటర్ సర్వేలో బీజేపీ కూటమికి 57, కాంగ్రెస్ కూటమికి 44 స్థానాలు దక్కాయి.ఎబీపీ -ఏసీ నీల్సన్ సర్వేలో బీజేపీకి 78, కాంగ్రెసుకు 36 వచ్చాయి.

టైమ్స్ నౌ – ఇండియా టీవీ- సి ఓటర్ సర్వేలో బీజేపీకి 55, కాంగ్రెసుకు 53 అంచనా వేశారు.ఎవీసీ సర్వ్ బీజేపీకి 48-54 సీట్లు వస్తాయని, కాంగ్రెసుకు 40 వస్తాయని అంచనా వేసింది.

అసలు ఫలితాలు వస్తేగానీ ఈ ఫలితాలు ఎంతవరకు నిజమవుతాయో తేలుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube