ప్రపంచం మీద పెత్తనం కోసం చైనా దూసుకొస్తున్న సంగతి తెలిసిందే.దీంతో అమెరికా వెన్నులో వణుకు మొదలైంది.
ఇప్పటికే హైపర్ సోనిక్ టెక్నాలజీతో పెద్దన్నకు సవాల్ విసురుతోన్న డ్రాగన్.ఇటీవల అమెరికాను దాటి సంపదలోనూ నెంబర్ వన్‌గానూ నిలిచింది.
వీటన్నింటి మధ్య చైనా, తైవాన్ వ్యవహారం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు మరింత దారితీసింది.ఈ నేపథ్యంలో డ్రాగన్ దూకుడుకు కళ్లెం వేయాలని అమెరికా పావులు కదుపుతోంది.
దీనిలో భాగంగానే 8 చైనా సంస్థలను అమెరికా బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది.చైనా సైన్యం అభివృద్ధి చేస్తోన్న క్వాంటం కంప్యూటింగ్ ప్రయత్నాలకు ఈ కంపెనీలు సహాయం చేస్తున్నాయని కారణాలు చూపింది.
ఈ కంపెనీలు చైనా సైన్యానికి సహాయం చేయడం మాత్రమే కాకుండా అమెరికాకు చెందిన వస్తువులను ఆ దేశ సైన్యం కోసం కొనుగోలు చేయడం లేదా కొనుగోలు చేయడానికి ప్రయత్నించాయని అమెరికా ఆరోపిస్తోంది.అందుకే ఈ టెక్ కంపెనీలను ‘Entity list’ లో చేరుస్తున్నట్లు ఫెడరల్ ప్రభుత్వం ప్రకటించింది.
పాకిస్తాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమంతో పాటు రష్యన్ నాన్ ప్రొలిఫెరేషన్ కార్యక్రమాలకు ఈ సంస్థలు మద్ధతు ఇవ్వకుండా బ్లాక్‌లిస్ట్‌లో పెడుతున్నట్లు యూఎస్ వాణిజ్య కార్యదర్శి గినా రైమోండో ఒక ప్రకటనలో తెలిపారు.
అటు అమెరికా చర్యను వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం తీవ్రంగా వ్యతిరేకించింది.
చైనా ప్రతినిధి లియు పెంగ్యూ మాట్లాడుతూ.జాతీయ భద్రత పేరు చెప్పి చైనా కంపెనీలను అన్ని విధాలుగా నిరోధించడానికి అమెరికా తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని అన్నారు.
అమెరికా బ్లాక్ లిస్ట్‌లో పెట్టిన చైనా కంపెనీలు ఇవే:
1.హాంగౌ జోంగ్‌కే మైక్రో ఎలక్ట్రానిక్స్ కో లి 2.న్యూ H3C సెమీకండక్టర్ టెక్నాలజీస్ 3.జియాన్ ఏరోస్పేస్ హుయాక్సన్ టెక్నాలజీ 4.హునాన్ గోక్ మైక్రోఎలక్ట్రానిక్స్ 5.యుంచిప్ మైక్రోఎలక్ట్రానిక్స్ 6.
హెఫీ నేషనల్ లాబోరేటరీ ఫర్ ఫిజికల్ సైన్సెస్ ఎట్ మైక్రోస్కేల్ 7.క్వాంటమ్ సీ టెక్ 8.
షాంగై క్వాంటమ్ సీ టెక్ కో.లి.