కార్లలో ఎయిర్‌బ్యాగ్స్‌ ఖచ్చితంగా ఉండాలన్న ప్రతిపాదన.. చిన్న కార్ల మార్కెట్‌పై తీవ్ర ప్రభావం!

6 Air Bags Mandatory In Cars Effects The Market Of Basic Level Cars Details, Car, Air Bags, Viral Latest, News Viral, Social Media , 6 Air Bags Mandatory ,cars , Basic Level Cars, Entry Level Cars, Maruthi Suzuki India, Six Air Bags, India Government

ఇండియన్ రోడ్లపై ప్రతి రోజు లెక్కలేనన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.ఈ ప్రమాదాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోగా మరెంతమందో తమ అవయవాలను కోల్పోతున్నారు.

 6 Air Bags Mandatory In Cars Effects The Market Of Basic Level Cars Details, Car-TeluguStop.com

ఈ తరుణంలో యాక్సిడెంట్స్‌ తగ్గించేందుకు రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ వీలైనన్ని చర్యలు చేపడుతోంది.అనూహ్యకారణాల వలన రోడ్డు ప్రమాదాలు జరిగినా, ఆ ప్రమాదాల్లో వాహనదారులు ప్రాణాలు కోల్పోకుండా ఉండేందుకు సరికొత్త ప్రతిపాదనలను తీసుకొస్తోంది.

ఈ క్రమంలో చేసిన ఓ ప్రతిపాదనను ఒకసారి పునఃసమీక్షించాలని MSI (మారుతి సుజుకి ఇండియా) కోరింది.

ఆ ప్రతిపాదన ఏమంటే, ప్రయాణీకుల వాహనాలలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం ఓ ప్రతిపాదన తీసుకువచ్చిన సంగతి తెలిసినదే.

ఇదే ప్రతిపాదనను ప్రభుత్వం పునఃపరిశీలించాలని మారుతి విజ్ఞప్తి చేస్తోంది.సదరు వాహనదారులకు రక్షక కవచంలా పనిచేసే ఎయిర్‌బ్యాగ్‌ల విషయంలో మారుతి సుజుకి ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తుంది? డ్రైవర్‌తో పాటు ప్రయాణీకుల ప్రాణాలను రక్షించే లైఫ్ సేవింగ్ ఎయిర్‌బ్యాగ్స్‌ను కార్స్‌లో ఎక్కువగా ఇవ్వాలని ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలో తప్పేముంది?

Telugu Air Bags, Cars, Level Cars, India, Maruthisuzuki, Latest-General-Telugu

మారుతి వారు ఏం చెబుతున్నారంటే, ప్యాసింజర్ కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్స్‌ను ఉండాలనే నియమం వలన ఇప్పటికే అమ్మకాలు తగ్గిపోతున్న చిన్న కార్ల మార్కెట్‌కు పెద్ద ఎదురు దెబ్బ తగులుతుందని ఒకటి, తద్వారా ఆటో రంగంలో ఉద్యోగాలపై కూడా ప్రభావం చూపుతుందని అంటున్నారు.అంతేకాకుండా ఈ నియమం ఒకవేళ అమలులోకి వస్తే, గత 3 సంవత్సరాలుగా పేలవమైన అమ్మకాలతో కుదేలైన కాస్ట్-సెన్సిటివ్ ఎంట్రీ-లెవల్ కార్ సెగ్మెంట్‌పై తీవ్ర నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుందని మారుతి ఆరోపిస్తోంది.అదనంగా అందించే ఎయిర్‌బ్యాగ్స్‌ వల్ల కారు ధర పెరుగుతుందని.

ఫలితంగా చిన్న కార్లను కొనాలని కలలుగానే టూవీలర్ వాహనదారులకు స్మాల్ కార్ కొనడం అసాధ్యంగా మారుతుందని ఆటో దిగ్గజం పేర్కొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube