Neena Singh Dr Indu Lew : మగువా నీకు వందనం.. అమెరికాలో నలుగురు భారత సంతతి మహిళలకు సత్కారం..!

ఆమె ఒక తల్లి, కూతురు, సోదరి, భార్య.వీటన్నింటికి మించి ఒక పోరాట యోధురాలు.

 4 Eminent Indian Origin Women Honoured In Us On International Womens Day-TeluguStop.com

శక్తి యుక్తులు కలిగిన నారీమణి.అతని వెంట ఆమె కాదు.

అన్నింటా ఆమే.అదే ఇప్పుడు ఆమె లక్ష్యం.ఆవకాయ పెట్టడం నుంచి అంతరిక్షానికి చేరుకునే వరకు.అగ్గి పెట్టెల తయారీ దగ్గర్నుంచి యుద్ధ విమానాలు నడిపే వరకు అన్నింటా ఆమె ఉనికి కనిపిస్తోంది.ఆమె ఆకాశంలో సగం కాదు.ఇప్పుడు ఆమే ఆకాశం.

పురుషాధిక్య సమాజంలో మగవాళ్లను తోసిరాజని మహిళలు దూసుకెళ్తున్నారు.

Telugu Dr Indu Lew, Honoured, Indian Origin, Megha Desai, Neena Singh, Jersey, Y

ఆ రంగం ఈ రంగం అని లేకుండా ఇప్పుడు అన్నింటా ఆమె తోడ్పాటు లేకుండా ఏ వ్యక్తి కానీ, ఏ వ్యవస్థ కానీ ఏం చేయలేరని ఎన్నో సార్లు రుజువైంది.వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికా వెళ్లిన భారతీయుల్లో మహిళలు కూడా వున్నారు.వీరు అక్కడ కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ భారతదేశ కీర్తి ప్రతిష్టలను రెపరెపలాడిస్తున్నారు.

ఇప్పుడు అమెరికాలో రెండో శక్తివంతమైన పదవిలో వున్నది ఓ మహిళ, అందులోనూ భారతీయురాలు కావడం మనందరికీ గర్వకారణం.

Telugu Dr Indu Lew, Honoured, Indian Origin, Megha Desai, Neena Singh, Jersey, Y

కాగా.అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికాలో నలుగురు భారత సంతతి మహిళా ప్రముఖులను ఘనంగా సత్కరించారు.న్యూయార్క్‌( New York )లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా మహారాణి రాధికారాజే గైక్వాడ్, నీనా సింగ్, డాక్టర్ ఇందు లెవ్, మేఘా దేశాయ్‌లను సన్మానించారు.

న్యూయార్క్‌లోని భారత కాన్సుల్ జనరల్ బినయ ప్రధాన్, ఎఫ్ఐఏ ప్రెసిడెంట్ డాక్టర్ అవినాష్ గుప్తాలు శుక్రవారం కాన్సులేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వీరిని సత్కరించారు.

గైక్వాడ్(Maharani Radhikaraje Gaekwad ) తన దాతృత్వ సేవలతో విద్య, సమాజ సాధికారతకు కట్టుబడి వున్నారని ఎఫ్ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది.

సింగ్( Neena Singh ) న్యూజెర్సీలో భారతీయ సిక్కు మహిళా మేయర్.మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో, సామాజిక సేవలో ఆమె ప్రసిద్ధి చెందారు.లెవ్ విషయానికి వస్తే.క్లినికల్ ఫార్మాసిస్ట్ నుంచి ఆర్‌డబ్ల్యూజే బర్నాబాస్ హెల్త్‌లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఎదిగారు.

ఆరోగ్య సంరక్షణ రంగంలో అసాధారణమైన నాయకత్వాన్ని ప్రదర్శించారు.మేఘా దేశాయ్ .దేశాయ్ ఫౌండేషన్ అధ్యక్షుడిగా గ్రామీణ భారతదేశంలోని మహిళలు, పిల్లలకు ఆరోగ్యం, జీవనోపాధి, రుతుక్రమ సమానత్వాన్ని మెరుగుపరచడంపై కృషి చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube