24 ఏళ్ల యువతి సాధారణంగా 30 లేదా 35 ఏళ్లలోపు వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది కానీ అమెరికాలో 24 యువతి 85 ముసలి వ్యక్తిని పెళ్లాడింది.వివరాల్లోకి వెళ్తే.
మిరాకిల్ పోగ్ అనే యువతి వయసు 24.చార్లెస్ పోగ్ అనే వృద్ధుడి వయసు 85.అంటే వీరిద్దరి మధ్య 61 సంవత్సరాల గ్యాప్ ఉంది.అయినా దీని గురించి వారు ఏం ఆలోచించకుండా పెళ్లి చేసుకున్నారు.2019లో మిరాకిల్ లాండరెట్‌లో పని చేస్తున్నప్పుడు ఈ వృద్ధుడిని తొలిసారిగా కలిసింది.అంతే కాదు తొలిచూపులోనే అతడి పై మనసు కూడా పారేసుకుందట.
ఇక చార్లెస్ 2020, ఫిబ్రవరి నెలలో ప్రపోజ్ చేశాడట.దాంతో ఎంతో సంతోషించినా మిరాకిల్ అతడిని అదే ఏడాది జులై నెలలో పెళ్లి చేసుకుంది.మిరాకిల్ తల్లి, తాత వీరి పెళ్లిని సపోర్ట్ చేశారు.కాకపోతే ఆమె తండ్రిని ఒప్పించడం కష్టం అయింది.అయితే, చార్లెస్‌ని కలిసిన తర్వాత, అతను చివరికి మద్దతు ఇచ్చాడు.మిరాకిల్ తల్లి వయసు కేవలం 45, తండ్రి వయసు 47 ఏళ్లు.
కానీ అతని భర్త వయసు మాత్రం 85.అంటే ఆమె తనకు తాతయ్య వరుసయ్యే వ్యక్తిని పెళ్లాడింది.
ఈ జంట ఒక బిడ్డను కనాలని భావిస్తోంది.చార్లెస్ మరి ఎంతో కాలం బతికే అవకాశం లేదు కాబట్టి అతడు తన వైఫ్ కి తన ప్రతిరూపంగా ఒక బిడ్డని ఇవ్వాలనుకుంటున్నాడట.మిరాకిల్ కూడా IVF క్లినిక్‌కి వెళ్లాలని ప్రయత్నించింది.అయితే ఈ వయసులో చార్లెస్ కి బిడ్డలు పుట్టడం అసాధ్యం.కాబట్టి వారు ఈ పిల్లల ప్లానింగ్ మధ్యలోనే వదిలేశారట.ఏది ఏమైనా ఇప్పుడు ఈ జంట స్టోరీ వరల్డ్ వైడ్ గా వైరల్ అవుతుంది.
రిటైర్డ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయిన చార్లెస్ తన పెళ్లి గురించి ఆన్‌లైన్‌లో చేస్తున్న కామెంట్స్ ని పట్టించుకోనని అంటున్నాడు.