ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంభవించిన వరదల్లో ఒక్కరోజే సుమారు 17 మంది గల్లంతు అయ్యారు.వీరిలో తొమ్మిది మంది మృతదేహాలు లభ్యం కాగా మిగిలిన వారి కోసం డ్రోన్ లు, బోట్లతో అధికారులు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
అటు మోరంచపల్లి గ్రామానికి చెందిన నలుగురి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు.ములుగు జిల్లా ఏటూరినాగారం మండలంలోని జంపన్న వాగులో మొత్తం ఏడుగురు గల్లంతు కాగా వారిలో ఐదుగురు మృతదేహాలు దొరికాయి.
జంపన్న వాగును దాటే క్రమంలో వారు గల్లంతు అయ్యారని సమాచారం.ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
ఈ క్రమంలో అధికారులు స్పందించి తమను కాపాడాలని కోరుతున్నారు.