భారత సమాజంలో వివిధ ఆచారాలు, నమ్మకాలు కనిపిస్తాయి.ఆధునిక భారతదేశంలో ఇప్పటికీ ఎంతో ప్రబలంగా ఉన్న 10 అరుదైన నమ్మకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.1.భారతదేశంలో జిప్సీ అనే ఒక తెగ ఉంది.వారు మరణాన్ని తమ జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణంగా భావిస్తారు.2.మలానా అనేది హిమాచల్‌లోని పురాతన భారతీయ గ్రామం.అక్కడి ప్రజలు తమను తాము అలెగ్జాండర్ ది గ్రేట్ వారసులుగా భావిస్తారు.3.భారతదేశంలో వివాహిత స్త్రీలు తమ పాదాలకు పారాణి రాసుకుంటారు.ఇది గోరు నరాలపై ఒత్తిడి తెస్తుందని, తద్వారా పునరుత్పత్తి వ్యవస్థ, ఆరోగ్యం రెండింటినీ సమతుల్యం చేస్తుందనే అపోహ నెలకొంది.4.దేశంలో నేటికీ పాములను దేవతలుగా పూజిస్తారు.చాలా మంది మహిళలు పాములకు పాలు పోస్తుంటారు.అయితే వాస్తవానికి పాములు ఎప్పుడూ పాలు తాగవు.5.దేశంలోని కొన్ని మారుమూల గ్రామాలలో పిల్లలను గుడి పైకప్పు నుండి విసిరి, కింద ఉన్న పెద్దలు పట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది.6.పురాతన దేవదాసీ వ్యవస్థ కొన్ని దేవాలయాల్లో ఇంకా కొనసాగుతోంది.యువతుల కన్యత్వాన్ని వేలం వేస్తుంటారు.7.2004 నుండి భారతదేశంలో జరిగిన ప్రతి ఎన్నికలలో ఒక ఓటరు కోసం అడవిలో ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు.8.దేశంలో చాలామంది బయటకు వెళ్లేముందు తమ వాహనాల చక్రాల క్రింద నిమ్మకాయలను ఉంచుతారు.ఇది తమను కష్టాల నుండి కాపాడుతుందని వారు నమ్ముతారు.9.భారతదేశంలోని అఘోరీ సాధువులు అంత్యక్రియల తర్వాత మానవ అవశేషాలను తింటారు.మృతదేహాలతో లైంగిక సంబంధం పెంచుకుంటారు.వారు ప్రపంచాన్ని త్యజించేందుకే ఇలా చేస్తారు.10.దేశంలోని కొన్ని గ్రామాలలో జంతువుల వివాహం జరగుతుంటుంది.వరుణుడిని ప్రసన్నం చేసుకునేందుకు అస్సాం, మహారాష్ట్రలలో కప్పలకు పెళ్లి చేస్తారు.
కర్ణాటకలో గాడిదల వివాహం దీనికి ఉదాహరణగా నిలుస్తుంది.