సీబీఐ దర్యాప్తుపై వైయస్ సునీత సంచలన వ్యాఖ్యలు..!!

నేడు దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి( YS Vivekananda Reddy ) 72వ జయంతి పురస్కరించుకుని ఆయన కుమార్తె వైయస్ సునీత( YS Sunitha ) కేక్ కట్ చేశారు.వైయస్ వివేకానంద రెడ్డి సమాధి వద్ద కేక్ కట్ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

 Ys Sunitha Sensational Comments On Cbi Investigation Details, Ys Sunitha, Cbi, Y-TeluguStop.com

ఈ హత్య కేసులో సీబీఐ తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని సునీత చెప్పుకొచ్చారు.నాన్న బతికి ఉంటే ఈరోజు 72వ జన్మదినోత్సవం అయి ఉండేదని పేర్కొన్నారు.

నాన్న జన్మదినోత్సవం పురస్కరించుకుని కొన్ని జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని తెలిపారు.పాఠశాలలలో చదువుకునే రోజుల్లో తన గురించి ఎవరో ఏదో అన్నారని తాను బాధపడుతున్న టైంలో నాన్నగారు ఓ మాట చెప్పారు.

మన గురించి ఎవరైనా పొగిడితే దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

కానీ మన తప్పులు గురించి చెబితే అది కచ్చితంగా సీరియస్ గా గ్రహించి.ఆ లోపాలను మనలో సరిదిద్దుకోవాలి అని చెప్పారు.నాన్నగారు చెప్పిన సలహాలు, జ్ఞాపకాలు ఈరోజు గుర్తుకు వస్తున్నాయని ఎమోషనల్ గా మాట్లాడారు.

ఇక ఈ హత్య కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు( CBI ) వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు.ఇందులో తన జోక్యం అవసరం లేదని…సీబీఐ దర్యాప్తుపై ఎలాంటి కామెంట్ చేయనని వైయస్ సునీత చెప్పుకొచ్చారు.

ఈ కేక్ కటింగ్ కార్యక్రమంలో వైఎస్ సునీతతో పాటు ఆమె భర్త నర్రేటి రాజశేఖర్ రెడ్డి ఇంకా కుటుంబ సభ్యులు పాల్గొని వైయస్ వివేకానంద రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube