వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఛలో ప్రగతిభవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు.ప్రగతిభవన్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో లోటస్ పాండ్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు.
దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.అయితే వారి కళ్లుగప్పి వైఎస్ షర్మిల అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
నిన్న టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్పడిన దాడిలో ధ్వంసమైన కార్వాన్ ను పరిశీలించిన తర్వాత షర్మిల ప్రగతిభవన్ ముట్టడికి పిలుపు నిచ్చారు.మరోవైపు రేపటి నుంచి యథావిధిగా మహబూబాబాద్ జిల్లాలో ఆమె పాదయాత్ర కొనసాగనుంది.