ఎన్టీఆర్ ఓపెన్ లెటర్ రాయడం వెనుక అసలు కారణం ఇదేనా.. ఆ వార్తలు బాధించడంతో?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో మరో ఇండస్ట్రీ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు.తెలుగులో ఆర్ఆర్ఆర్ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా ఇతర ఇండస్ట్రీలలో మాత్రం ఈ సినిమా పాజిటివ్ రివ్యూలతో కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటోంది.

 Young Tiger Ntr Open Letter Goes Viral In Social Media Details Here , Ntr , Toll-TeluguStop.com

మరో రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాలలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.

నైజాం ఏరియాలో మొదట ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

ఇప్పటికే నైజాంలో ఈ సినిమాకు 61 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయనే సంగతి తెలిసిందే.రేపటికే ఈ సినిమా నైజాంలో బ్రేక్ ఈవెన్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

నిర్మాత డివివి దాన్నయ్య  ఫుల్ రన్ లో ఆర్ఆర్ఆర్ ఊహించని స్థాయిలో లాభాలను అందించే ఛాన్స్ ఉంది.

Telugu Alia Bhatt, Ntr Fans, Letter, Raja Molui, Ram Charan, Rrr, Tollywood, You

అయితే ఎన్టీఆర్ తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రస్తావిస్తూ ఓపెన్ లెటర్ రాశారు.చరణ్ లేనిదే ఆర్ఆర్ఆర్ మూవీ లేదని అల్లూరి పాత్రకు చరణ్ పూర్తిస్థాయిలో న్యాయం చేశారని తారక్ చెప్పుకొచ్చారు. భీమ్ పాత్రలో ఒదిగిపోయే విధంగా స్పూర్తిని ఇచ్చిన జక్కన్నకు థ్యాంక్స్ అని తారక్ కామెంట్లు చేశారు.

అల్లూరి పాత్ర లేకపోతే భీమ్ పాత్ర అంత అద్భుతంగా వచ్చేది కాదని తారక్ వెల్లడించారు.

Telugu Alia Bhatt, Ntr Fans, Letter, Raja Molui, Ram Charan, Rrr, Tollywood, You

ఆర్ఆర్ఆర్ విషయంలో ఎన్టీఆర్ హర్ట్ అయ్యాడని, స్క్రీన్ స్పేస్ విషయంలో ఎన్టీఆర్ ఫీలయ్యాడని వార్తలు ప్రచారంలోకి వస్తున్న నేపథ్యంలో ఆ వార్తలకు చెక్ పెట్టడానికి ఎన్టీఆర్ ఎమోషనల్ లెటర్ రాశారని తెలుస్తోంది.ఆర్ఆర్ఆర్ విషయంలో తాను పూర్తిస్థాయిలో సంతృప్తితో ఉన్నానని ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ఇకనైనా ఎన్టీఆర్ గురించి తప్పుగా ప్రచారంలోకి వస్తున్న వార్తలు ఆగుతాయేమో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube