యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో సంచలన నిర్ణయం.. ఆ ప్రాజెక్ట్ ఆలస్యం కానుందా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ మూవీ అయిన ఆర్ఆర్ఆర్ కోసం నాలుగేళ్ల సమయం కేటాయించారు.ఆర్ఆర్ఆర్ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచినా ఈ సినిమా సక్సెస్ లో చరణ్ కు కూడా క్రెడిట్ ఉందనే విషయం తెలిసిందే.

 Young Tiger Junior Ntr Sensational Decision Koratala Shiva Details, Young Tiger-TeluguStop.com

తారక్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తూనే మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటే బాగుండేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.తారక్ తర్వాత సినిమా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కనుంది.

ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో వచ్చిన క్రేజ్ ను నిలబెట్టుకోవాలంటే తారక్ తర్వాత సినిమాతో కూడా సక్సెస్ సాధించాల్సి ఉంది.అయితే ఆచార్య ఫ్లాప్ తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమా రిజల్ట్ విషయంలో తారక్ అభిమానులు ఒకింత టెన్షన్ పడుతున్నారు.

అయితే ఆచార్య రిజల్ట్ తో తన సినిమా స్క్రిప్ట్ విషయంలో మరోసారి కూర్చోవాలని ఎన్టీఆర్ కొరటాల శివకు సూచించారని సమాచారం.

తారక్ మూవీ స్క్రిప్ట్ కు కొరటాల శివ మార్పులు చేస్తున్నారని బోగట్టా.

Telugu Acharya, Buchibabu, Koratala Shiva, Ntr, Rajamouli, Ram Charan, Sensation

జూన్ నెల నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కావాల్సి ఉండగా నాలుగు నెలలు ఆలస్యంగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది.అయితే ఈ ప్రచారానికి సంబంధించి నిజానిజాలు తెలియాల్సి ఉంది.ఎప్పుడు షూటింగ్ మొదలైనా ఈ సినిమాను వేగంగానే పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

Telugu Acharya, Buchibabu, Koratala Shiva, Ntr, Rajamouli, Ram Charan, Sensation

మరోవైపు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించి రెండు అప్ డేట్స్ రానున్నాయని తెలుస్తోంది.ఈ అప్ డేట్స్ కోసం తారక్ ఫ్యాన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఎన్టీఆర్ పుట్టినరోజున తారక్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన ప్రకటనలు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.

తారక్ బుచ్చిబాబు కాంబో మూవీకి సంబంధించిన ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube