రజని.ఒకప్పుడు తెలుగు, తమిళ సినిమా పరిశ్రమల్లో ఓవెలుగు వెలిగిన అందాల తార.రెండు భాషల్లో కలిపి 150 సినిమాల్లో నటించింది.తెలుగులోని అగ్ర నటుడు అందరితోనూ కలిసి నటించింది.
చిరంజీవి మాత్రమే తనతో సినిమా చేయలేదు.ఒకప్పుడు ఏమాత్రం తీరిక లేకుండా సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ.
ప్రస్తుతం ఈ అమ్మడు పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లలతో సంతోషంగా కుటుంబ జీవితాన్ని గడుపుతుంది.రెండు దశాబ్దాలుగా సినిమాలకు దూరంగా ఉంటూ హైదరాబాద్ లోనే నివసిస్తుంది.
ఈమె అప్పట్లో ఇంగ్లీష్ మాట్లాడితే అందరూ అబ్బుర పడేవారు.అయితే తను ఎక్కువగా చదువుకోలేదు.కనీసం టెన్త్ కూడా పాస్ కాలేదంటే నమ్మబుద్ది కాదు.కేవలం 9వ తరగతి వరకు చదువుకుని ఆ తర్వాత చదువకు దూరం అయ్యింది.
టెన్త్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న సమయంలోనే ఆమెకు సినిమా అవకాశం వచ్చింది.తొలుత తమిళ సినిమా పరిశ్రమ నుంచి ఆఫర్ వచ్చింది.
సినిమా పేరు ఇళమే కాలందు. ఈ సినిమాలో మోహన్ హీరోగా చేశాడు.
దానికి మణివణ్ణన్ దర్శకుడు.రజనిని చూసిన ప్రొడక్షన్ మేనేజర్.
ఈ విషయాన్ని దర్శకుడికి చెప్పాడు.ఆయన రజనిని చూసి ఓకే చెప్పారు.
అనుకోని అవకాశానికి రజనితో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా ఆశ్చర్యపోయారు.
పదో తరగతి అయిపోగానే రజనికి పెళ్లిచేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.అందుకే ఈ విషయం గురించి మాట్లాడి చెప్తామని రజనీ తండ్రి దర్శకుడికి చెప్పారు.ఇంటికి వచ్చి అందరినీ కూర్చోబెట్టి విషయం చెప్పారు.
అయితే చాలా మంది తనకు పెళ్లి కంటే సినిమాల్లోకి వెళ్లేందుకే అవకాశం కల్పించాలని చెప్పారు.ఈ సినిమాలో చేయనిద్దాం.
ఆ తర్వాత అవకాశాలు వస్తే ఓకే.రాకపోతే అప్పుడు పెళ్లి చేద్దామని చెప్పారు.మొత్తంగా వారికి కుటుంబ సభ్యులు ఓకే చెప్పడంతో రజనీ తొలి సినిమా చేసింది.తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ తర్వాత తనకు వరుస అవకాశాలు వచ్చాయి.