నిజానికి ఏ యుద్ధంలో గెలవాలన్నా తమ బలంతో పాటు ప్రతిపక్ష బలహీనతలపై కూడా దృష్టి పెట్టాలి .ప్రత్యర్థి బలహీనతలను ఉపయోగించుకొని మన బలాన్ని పెంచుకుంటూ ముందుకు వెళితేనే ఏ యుద్ధంలోనైనా విజయం సాధించడం సులువు అవుతుంది.
ఇప్పటివరకు ప్రతిపక్షాల బలహీనతలపై దృష్టి పెట్టి ఆడుకున్న వైసిపి ఇప్పుడు తమ బలాన్ని పెంచుకునే పని మొదలుపెట్టిందని తెలుస్తుంది .రాయలసీమ అన్నది సంప్రదాయకంగా వైసీపీ ఓటు బ్యాంకు గా ఉంది .వైయస్సార్ హయాం నుంచి తిరుగులేని మెజారిటీ అందిస్తూ వస్తుంది.అయితే రాయలసీమ ప్రయోజనాల పట్ల వైసిపి కొంత ఉదాసీనం గా వ్యవహరించిందనే చెప్పాలి అక్కడ తాగునీటి సాగునీటి ప్రాజెక్టుల పట్ల కనీసం ప్రతిపక్ష టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసినంత కూడా చేయకపోవడం తమ బలాన్ని పట్టించుకోకపోవడమే అని చెప్పాలి.
దాంతో ఇప్పుడు టిడిపి జగన్ బలంపై గురి పెట్టింది.రాయలసీమకు జగన్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని తమకు అవకాశం ఇస్తే రాయలసీమను అభివృద్ధి చేస్తామంటూ పులివెందులలో బహిరంగ సభ పెట్టి మరీ చంద్రబాబు ప్రకటించారు.
దాంతో మేల్కొన్న వైసీపీ( YCP ) అధిష్టానం ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు పూనుకున్నట్లుగా తెలుస్తుంది రాయలసీమ ఎనిమిది జిల్లాలలోనూ ఉన్న 52 స్థానాలలో గతంలో 49 స్థానాలను వైసిపి గెలుచుకోగా కేవలం టిడిపి మూడు స్థానాలతో సరిపెట్టుకుంది.అయితే ఈసారి ఎన్నికలు హోరాహోరీగా సాగుతాయని అంచనాలకు ఉన్న నేపథ్యంలో మెజారిటీ ఫిగర్ 85 కావాలి అంటే రాయలసీమ జిల్లాలో 52 సీట్లు కీలకంగా మారతాయని వైసీపీ లెక్కలు వేసుకుంటుంది .
ముఖ్యంగా జనసేన తెలుగుదేశం పొత్తు( Jana sena ) ఉత్తరాంధ్రలోనూ గోదావరి జిల్లాలలోను తమకు వ్యతిరేకంగా మారుతుందని గ్రహించిన వైసీపీ అధిష్టానం తమ బలమైన రాయలసీమలో మెజారిటీ సీట్లు గెలుచుకుంటే టార్గెట్ రీచ్ అవ్వటం ఈజీ అని బావిస్తుందట .దాంతో ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న విమర్శలను దీటుగా ఎదుర్కోవాలని రాయలసీమ ప్రయోజనాల పై ప్రత్యేక ఫోకస్ పెట్టి ఇక్కడ ప్రజల మన్ననలు పొందేందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించినట్లుగా తెలుస్తుంది .ఎట్టి పరిస్థితుల్లోనూ 2019 నాటి ఫలితాలను రిపీట్ చేయాలని భావిస్తున్న వైసిపి అధిష్టానం రాయలసీమ జిల్లాలలో కచ్చితంగా 50 సీట్లు కొట్టాలని మిగతా 35 సీట్లను మిగిలిన ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాల నుంచి తెచ్చుకుంటే సరిపోతుందన్నవ్యూహం లో ఉన్నట్టుగా తెలుస్తుంది .