మంచు లక్ష్మికి ఓ మంచి స్క్రిప్ట్‌ దొరికిందట!

మంచు మోహన్ బాబు నట వారసురాలు మంచు లక్ష్మి( Manchu Lakshmi ) మల్టీ ట్యాలెంటెడ్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.హీరోయిన్‌ గా నటించిన ఈమె నిర్మాతగా దర్శకురాలిగా విలన్‌ గా కూడా చేసింది.

 Manchu Lakshmi Going To Start New Movie Soon Details, Manchu Lakshmi, Manchu Vis-TeluguStop.com

బుల్లి తెరపై కూడా సందడి చేసింది.ప్రస్తుతం యూట్యూబ్‌ లో అప్పుడప్పుడు కనిపిస్తుంది.

కానీ సినిమా లు లేదా సిరీస్ ల్లో మాత్రం కనిపించడం లేదు.ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు.

మల్టీ ట్యాలెంటెడ్‌ అని నిరూపించుకున్న మంచు లక్ష్మి ఎందుకు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు అనే ప్రశ్నకు ఇన్నాళ్లు సమాధానం లేదు.ఎట్టకేలకు ఆ ప్రశ్నకు సమాధానం లభించింది.

Telugu Lady, Manchu, Manchu Fans, Manchu Lakshmi, Manchu Vishnu, Manoj, Mohan Ba

తనకు సూట్ అయ్యే పాత్రలు రాక పోవడం వల్లే ఇండస్ట్రీకి దూరంగా ఉండాల్చి వచ్చిందని ఆమె సన్నిహితుల వద్ద అన్నారట.ఆమె ప్రతిభ ఆధారంగా దర్శకులు కథలు రాస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది.తాజాగా మంచు లక్ష్మికి ఒక మంచి స్క్రిప్ట్‌ దక్కిందట.ఆ స్క్రిప్ట్‌ పై ప్రస్తుతం వర్క్ జరుగుతుందట.అతి త్వరలోనే ఒక లేడీ ఓరియంటెడ్‌ మూవీ( Lady Oriented Movie ) ప్రారంభం కాబోతున్నట్లుగా తెలుస్తోంది.ఆ సినిమాకు తానే స్వయంగా నిర్మాతగా వ్యవహరించబోతున్న మంచు లక్ష్మి ప్రతిభావంతుడైన ఒక వ్యక్తికి దర్శకత్వ బాధ్యతలు అప్పగించిందని సమాచారం అందుతోంది.

Telugu Lady, Manchu, Manchu Fans, Manchu Lakshmi, Manchu Vishnu, Manoj, Mohan Ba

మొత్తానికి మంచు లక్ష్మి హీరోయిన్‌ గా చాలా రోజుల తర్వాత ఒక సినిమా రాబోతున్న నేపథ్యం లో మంచు వారి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.మోహన్‌ బాబు, విష్ణు చేసిన సినిమాలు నిరాశ పరిచాయి.దాంతో మంచు లక్ష్మి అయినా మంచు అభిమానులను( Manchu Fans ) సంతృప్తి పరిచేనా చూడాలి.ఇక మంచు మనోజ్ ను ( Manchu Manoj ) తన సినిమా లో గెస్ట్‌ రోల్‌ లో చూపించాలని కూడా మంచు లక్ష్మి ప్రయత్నాలు చేస్తుందట.

ఈ ప్రాజెక్ట్‌ ఎప్పటికి ఫైనల్‌ అయ్యేనో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube