యూట్యూబ్ ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య( Vaishnavi Chaitanya ).తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా ఆఫర్లు దక్కించుకోవడం పెద్ద టాస్క్ అయింది.
ఇలాంటి సమయంలో వైష్ణవి కి బేబీ సినిమా లో ఛాన్స్ దక్కింది.చిన్న సినిమా నే అయినా కూడా బేబీ ఏ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
బేబీ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం తో వైష్ణవి వరుస సినిమాల్లో చాన్స్ దక్కించుకుంటుంది అని అంతా భావించారు.
కానీ బేబీ సినిమా( Baby Movie ) వచ్చి 50 రోజులు అవుతున్నా కూడా ఇప్పటి వరకు వైష్ణవికి ఆఫర్లు రావడం లేదు.సాయి రాజేష్ దర్శకత్వం లోనే ఆమె హీరోయిన్ గా మరో సినిమా ను చేసేందుకు రెడీ అవుతున్న విషయం తెల్సిందే.హీరోయిన్ గా వైష్ణవి చేస్తున్న సినిమాలు పెద్దగా ఏమీ లేవు.
అయినా కూడా ఈమెను సినీ జనాలు పట్టించుకోవడం లేదు.హీరోయిన్ గా బేబీ సినిమా లో వైష్ణవి అద్భుతంగా నటించింది అంటూ విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
ఇండస్ట్రీకి చెందిన వారు కూడా చాలా మంది వైష్ణవి నటన పట్ల పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు.
కానీ ఏ ఒక్కరు కూడా ఒక మంచి పెద్ద సినిమా లో ఆఫర్ ను ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.నటిగా వైష్ణవి నూటికి 90 మార్కులు దక్కించుకుంది.ఉత్తరాది ముద్దుగుమ్మల కంటే నటన విషయం లో వైష్ణవి చాలా బెటర్ అని నిరూపించుకుంది.
కానీ ఆమెకు మాత్రం ఆఫర్లు అంతగా రాకపోవడం విడ్డూరం.కేవలం తెలుగు అమ్మాయి అవ్వడం వల్లే పాపం వైష్ణవికి సినిమా ల్లో ఆఫర్లు రావడం లేదు.
ముందు ముందు అయినా వైష్ణవి ప్రతిభ కు తగ్గట్లుగా ఆఫర్లు వస్తాయేమో చూడాలి.