11 నియోజకవర్గాలలో ఇన్చార్జిలను మార్చిన వైసీపీ..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి.ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ మరోసారి విజయం సాధించాలని తీవ్రస్థాయిలో కృషి చేస్తూ ఉంది.

ఈ క్రమంలో ఆ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్.వైసీపీ ప్రజా ప్రతినిధులను నాయకులను నిత్యం ప్రజలలో ఉండేవిధంగా జాగ్రత్త పడుతున్నారు.

ఇక ఇదే సమయంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో చాలామంది సిట్టింగ్ బీఆర్ఎస్ నేతలు ఓడిపోవడంతో… వైయస్ జగన్ ఏపీ ఎన్నికల విషయంలో జాగ్రత్తలు పడుతున్నారు.పరిస్థితి ఇలా ఉంటే తాజాగా వైసీపీ అధిష్టానం 11 నియోజకవర్గాలలో ఇన్చార్జులను మార్చి కొత్తవారిని నియమించడం జరిగింది.

ప్రత్తిపాడు నియోజకవర్గానికి బాలసాని కిరణ్, కొండేపి నియోజకవర్గానికి ఆదిమూలపు సురేష్, వేమూరు నియోజకవర్గానికి వరికూటి అశోక్ బాబు, తాడికొండ నియోజకవర్గనికి సుచరిత, సంతనూతలపాడు నియోజకవర్గానికి మేరుగు నాగార్జున, చిలకలూరిపేట నియోజకవర్గానికి మల్లెల రాజేష్ నాయుడు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం విడదల రజినీ, అద్దంకి నియోజకవర్గానికి హనిమిరెడ్డి, రేపల్లె నియోజకవర్గనికి ఈవూరు గణేష్, మంగళగిరి నియోజకవర్గానికి గంజి చిరంజీవి, గాజువాక నియోజకవర్గనికి రామచందర్ రావులను నియమించినట్లు.మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.ఈరోజు ఉదయమే మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేయడం జరిగింది.ఎన్నికల దగ్గర పడుతూ ఉండటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకీ మారుతూ ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube