గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం విషయంలో వైసీపీలో చోటు చేసుకుంటున్న రచ్చ ఇంతా అంతా కాదు.2019 ఎన్నికల్లో టిడిపి ( TTP )నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ ఆ తరువాత వైసిపికి దగ్గర కావడం, వచ్చే ఎన్నికల్లో వంశీనే ఈ నియోజకవర్గంలో నుంచి పోటీ చేస్తారని జగన్ ( CM jagan )ప్రకటించడంతో రచ్చ మొదలైంది.ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో వైసీపీ( YCP party )లో మూడు గ్రూపులు తయారయ్యాయి.2019లో వైసీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు, వల్లభనేని వంశీ లు మూడు గ్రూపులుగా ఉన్నారు.వచ్చే ఎన్నికల్లో ఎవరికి వారే తమదే టికెట్ అన్న ధీమా తో ఉన్నారు.అయితే వంశీ వైపే జగన్ మొగ్గు చూపిస్తూ ఉండడంతో, తాజాగా యార్లగడ్డ వెంకటరావు తన అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని , సీటు ఇవ్వకపోతే తన రాజకీయ భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారని పరోక్షంగా హెచ్చరికలు చేశారు.
ఎమ్మెల్యే వంశీ వైసిపి లో యాక్టిివ్ కావడాన్ని యార్లగడ్డ వెంకట్రావు, ( Yarlagadda Venkatarao )దుట్టా రామచంద్ర రావులు తీవ్రంగా వ్యతిరేకిస్తూనే వస్తున్నారు .ఈ నేపథ్యంలోనే యార్లగడ్డ వెంకట్రావు టిడిపిలో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతుండడంతో, దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు.పార్టీ అధికారంలో ఉన్నా, తనపై 19 కేసులు , దుట్టా రామచంద్రరా( Dutta Ramachandra Rao )వు పై 11 కేసులు ఉన్నాయని యార్లగడ్డ పేర్కొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా వైసిపి నేతల మీద కేసులు మాఫీ జరిగినా , ఒక్క గన్నవరం లో మాత్రమే అసలైన వైసీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు మాఫీ కాలేదు అని అన్నారు.2019 ఎన్నికల్లో అప్పటి ప్రత్యర్థి దొంగ ఇళ్ల పట్టాలు, రిగ్గింగ్ కారణంగా స్వల్ప ఓట్లతోనే నేను ఓడనంటూ పరోక్షంగా వంశీ పై వ్యాఖ్యలు చేశారు.ఇద్దరు మంత్రులు చేసిన పని కారణంగా టిడిపి నుంచి వచ్చిన వ్యక్తికి ఇప్పుడు గన్నవరం ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారని, తన ఇంటికి వచ్చి సన్మానం చేస్తానన్న వ్యక్తికి, నియోజకవర్గంలో ప్రతిపక్షంలో ఉండగా జగన్ సభకు కళ్యాణమండపం కూడా ఇవ్వని వ్యక్తికి, జగన్ ను భారతీని తిట్టిన వ్యక్తికి ఇన్చార్జి పదవి అప్పగించారని యార్ల గడ్డ ఫైర్ అయ్యారు.
నియోజకవర్గంలో వైసిపి నేతలు , కార్యకర్తలు కొత్త నాయకుడి కారణంగా నిరాదరణకు గురవుతున్నారని , ఈ విషయాన్ని జగన్ దృష్టికి తాను తీసుకువెళ్ళాను అని యర్లగడ్డ వెంకట్రావు తెలిపారు.వారిని మంత్రులు చూసుకుంటారని జగన్ హామీ ఇచ్చారని అన్నారు. పార్టీ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను కూడా ఇప్పించుకోలేని దుస్థితి నెలకొందని , తన రాజకీయ భవిష్యత్తు చూసుకుంటానని జగన్ కు చెప్పానని ఆయన అన్నారు .తాను క్రాస్ రోడ్ లో ఉన్నానని , రాజకీయాల్లో తాను ఎవరికి భయపడనని అన్నారు.‘ అన్నా గన్నవరం సీటు నాకు ఇవ్వు అంటూ కార్యకర్తల సమావేశంలో జగన్ కు యర్లగడ్డ విజ్ఞప్తి చేశారు .ఇప్పటికైనా గన్నవరం సీటు తనకు ఇవ్వాలని , లేకపోతే తన రాజకీయ భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారని యర్లగడ్డ సంచలన వ్యాఖ్యలు చేశారు.