చిరంజీవికి అవి పనికిరావని అన్నాను.. హర్ట్ అయ్యాడు.. యండమూరి కామెంట్స్ వైరల్!

ప్రముఖ రచయితగా, వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా యండమూరి వీరేంద్రనాథ్ పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నారనే సంగతి తెలిసిందే.యండమూరి రాసిన నవలలు పాఠకులను ఎంతగానో ఆకట్టుకునేవి.

 Yandamuri Veerendranth Comments About Chiranjeevi Goes Viral Details, Chiranjeev-TeluguStop.com

ఆయన నవలలలో కొన్ని నవలలు సినిమాలుగా తెరకెక్కి విజయాలను సొంతం చేసుకున్నాయి.తెలుగు రాష్ట్రాలలోని చాలా ప్రాంతాలలో యండమూరి విద్యాభ్యాసం పూర్తైంది.

చిన్న వయస్సులోనే యండమూరి వీరేంద్రనాథ్ సీఏ పూర్తి చేశారు.

స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో, ఆంధ్రా బ్యాంకులో యండమూరి విధులు నిర్వహించడం గమనార్హం.

యండమూరికి అనుగీతతో వివాహం జరగగా కొడుకు పేరు ప్రణీత్ కావడం గమనార్హం.యండమూరి వీరేంద్రనాథ్ రాసిన రఘుపతి రాఘవ రాజారాం అనే నాటకానికి సాహిత్య అకాడమీ అవార్డ్ దక్కగా వెన్నెల్లో ఆడపిల్ల అనే ధారావాహికకు ఏపీ ప్రభుత్వం నుంచి నంది అవార్డ్ లభించడం గమనార్హం.

యండమూరి వీరేంద్రనాథ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను రాసిన ఫస్ట్ నాలుగు బుక్స్ ను ఎవరూ పబ్లిష్ చేయలేదని అన్నారు.

Telugu Charan, Chiranjeevi, Nandi Award, Novelist, Prajarajyam, Raghavendra Rao,

తాను బ్రేక్ కోసం కొంత కష్టపడ్డానని ఆయన తెలిపారు.డబ్బు లేకపోతే ఇరిటేషన్, ఫ్రస్టేషన్ వస్తాయని ఆయన వెల్లడించారు.నవలలు ఇస్తే సినిమా రిలీజైన సమయంలోనే చూసేవాడినని ఆయన చెప్పుకొచ్చారు.

తాను కోదండరామిరెడ్డితో చేసిన సమయంలో వేరేవాళ్లతో చేయలేదని ఆయన తెలిపారు.

Telugu Charan, Chiranjeevi, Nandi Award, Novelist, Prajarajyam, Raghavendra Rao,

రాఘవేంద్రరావుతో కలిసి నాలుగైదు సినిమాలు చేశానని ఆయన తెలిపారు.చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో భేదాభిప్రాయాలు వచ్చాయని ఆయన చెప్పుకొచ్చారు.రామ్ చరణ్ గురించి నేను ఏదో కామెంట్ చేశానని చిరంజీవి హర్ట్ అయ్యాడని విన్నానని యండమూరి వెల్లడించారు.

చిరంజీవికి రాజకీయాలు పనికిరావని అన్నానని ఐదేళ్లు ప్రజాసేవ చేసి రాజకీయాల్లోకి వెళితే మంచి ఫలితాలు ఉంటాయని తాను చెప్పానని ఆయన వెల్లడించారు.చిరంజీవి మనస్తత్వానికి రాజకీయాలు సరిపోవని తాను చెప్పానని ఆయన తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube