ప్రపంచంలో అతిపెద్దదైన చేప ఇదే.. పొడవు 13 అడుగులు, బరువు 300 కేజీలు!

కంబోడియాలో కొలువైన మెకాంగ్‌ నది గురించి చాలా తక్కువ మందికి తెలుసు.ఆ నదికి ఓ ప్రత్యేకత కలదు.

 World Largest Fish Found In Cambodia Mekong River Details, Rate Fish, 13feets, V-TeluguStop.com

మెకాంగ్‌ నది చేపలకు ప్రపంచంలోనే అత్యంత అనువైన ఆవాసం గల నది.అందువలన ఈ నదిలో ఎక్కువగా చేపలు జీవిస్తాయి.ఆ కారణంగా అక్కడ జాలరులకు కొదువేమి ఉండదు.అయితే అక్కడ ప్రస్తుతం చేపల సంఖ్య రోజురోజుకీ తగ్గుతూ వస్తోంది.జాలరులు మితి మీరి చేపలు పట్టడం వలన, కాలుష్యం, ఉప్పునీటి చొరబాటు, అవక్షేపాల క్షీణత వంటి పలు కారణాల వలన ఈ నదిలో చేపల సంఖ్య తగ్గుతూ వస్తోంది.

2005లో థాయ్‌లాండ్‌లో 293 కేజీల బరువున్న ఓ క్యాష్‌ పిష్‌ను కనుగొన్న విషయం తెలిసినదే.ఈ చేపను కూడా కంబోడియా మెకాంగ్‌ నదిలోనే కనుగోవడం విశేషం.ఇకపోతే తాజాగా అదే నదిలో 13 అడుగులు, బరువు 300 కేజీలు కలిగిన ఓ భారీ చేపను పరిశోధకులు గుర్తించారు.

దీనిని లాగడానికి పదలు సంఖ్యలో జాలర్లు అవస్థలు పడ్డారు.ఖేమర్‌ భాషలో క్రిస్టెన్డ్‌ బోరామీ అనగా పూర్తి చంద్రుడు అని అర్ధం.ఈ పేరుతోనే ఈ చేపని పిలుస్తున్నారు.దాని ఆకారం వల్లే దానికి ఆ పేరు వచ్చిందని స్థానికులు అంటున్నారు.

దొరికిన వెంటనే జాలర్లు తెగ సంబరాలు చేసుకున్నారు.

Telugu Feets, Kg, Cambodia Fisher, Cambodiamekong, Freshwater Fish, Jeb Hogan, M

మార్కెట్లో అమ్మితే మంచి సొమ్ము వస్తుందని అనుకున్నారు.అయితే ఈ భారీ చేపను పరిశీలించిన పరిశోధకులు.జాలర్లను ఒప్పించి ఎలక్ట్రానిక్‌ ట్యాగ్‌తో తిరిగి నీళ్లలోకి వదిలేశారు.

వారికి పారితోషికంగా కొంత సొమ్ముని ముట్టజెప్పారు.ఇక దానికి తగిలించిన ఎలక్ట్రానిక్ ట్యాగ్ సాయంతో దాని కదలికలను వారు పరిశీలించనున్నారు.

నేషనల్‌ జియోగ్రాఫిక్‌ చానెల్‌లో ‘మాంస్టర్‌ ఫిష్‌’ షో నిర్వాహకుడు జెబ్‌ హోగన్‌. దీనిని అధికారికంగా ప్రపంచంలోనే అతిపెద్ద మంచి నీటి చేపగా అభివర్ణించడం విశేషం.

కాగా దీనిని చూడటానికి స్థానికులు వందల సంఖ్యలో అక్కడికి తరలి వెళ్లారు.జాలరులు సైతం అటువంటి పెద్ద చేపను ఇంతవరకు చూడలేదు అని చెప్పడం కొసమెరుపు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube