ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా( World Bank President Ajay Banga ) ) భారతదేశానికి రానున్నారు.వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ హోదాలో ఆయన తొలిసారి మాతృదేశానికి రానుండటం విశేషం .
వచ్చేవారం అహ్మదాబాద్‌లో జరిగే జీ20 దేశాల ఆర్ధిక మంత్రులు, కేంద్ర బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో అజయ్ పాల్గొననున్నారు.అజయ్ బంగాను వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేయగా.
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఆయన్ను ఎన్నుకున్నారు.ఈ క్రమంలో ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి భారతీయుడిగా అజయ్ బంగా చరిత్ర సృష్టించారు.
అంతేకాదు.ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్)లకు అధిపతిగా పనిచేసిన ఏకైక వ్యక్తిగా అజయ్ రికార్డుల్లోకెక్కారు.
ఈ ఏడాది జూన్‌లో ఆయన వరల్డ్ బ్యాంక్( World Bank ) సారథ్య బాధ్యతలు స్వీకరించారు.ఐదేళ్ల పాటు అజయ్ బంగా ఈ పదవిలో వుంటారు.
కాగా.నవంబర్ 10, 1959న మహారాష్ట్రలోని పూణేలో జన్మించిన అజయ్ బంగా పూర్తి పేరు. అజయ్ పాల్ సింగ్ బంగా( Ajaypal Singh Banga ).ఆయన తండ్రి భారత సైన్యంలో ఉన్నత అధికారి.నిజానికి వీరి స్వగ్రామం పంజాబ్‌లోని జలంధర్.అయితే తండ్రి ఉద్యోగ రీత్యా వారి కుటుంబం తరచుగా ఇతర ప్రాంతాలకు వెళ్లేది.
అజయ్ బంగా తండ్రి హర్భజన్ సింగ్ బంగా.లెఫ్టినెంట్ జనరల్‌గా పదవీ విరమణ పొందారు.
అజయ్ బంగా విద్యాభ్యాసం( Ajay Banga Biography ) సికింద్రాబాద్, జలంధర్, ఢిల్లీ, అహ్మదాబాద్, షిమ్లాలలో జరిగింది.బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ప్రైమరీ విద్యను పూర్తి చేసిన ఆయన.ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్‌సన్ కాలేజ్ నుంచి ఎకనమిక్స్‌లో హానర్స్ పట్టా పొందారు.ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో పీజీపీ, అహ్మాదాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి ఎంబీఏ అందుకున్నారు.1981లో నెస్లేలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన అజయ్ బంగా.13 సంవత్సరాల పాటు వివిధ హోదాల్లో పనిచేశారు.ఆతర్వాత పెప్సీకోలో పనిచేశారు.
ఇకపోతే.అజయ్ బంగాకు ఇటీవల అరుదైన గౌరవం లభించింది.ఈ ఏడాదికి గాను ‘‘గ్రేట్ ఇమ్మిగ్రెంట్స్’’( Great Immigrants List ) జాబితాలో ఆయన స్థానం సంపాదించారు.
సామాజిక సేవ, విరాళాలు, ఇతర చర్యల ద్వారా అమెరికాను సుసంపన్నం చేసినందుకు అజయ్‌కు ఈ గౌరవం దక్కింది.ఈ మేరకు న్యూయార్క్‌లోని కార్నెగీ కార్పోరేషన్ ఓ ప్రకటనలో తెలిపింది.అంతేకాదు… గ్రేట్ ఇమ్మిగ్రెంట్స్ జాబితాలో స్థానం పొందిన తొలి భారతీయ వ్యక్తిగా అజయ్ బంగా రికార్డుల్లోకెక్కారు.