వీడియో: గడ్డకట్టిన నదిలోకి దూకిన మహిళ.. ఇప్పటికీ దొరకని ఆమె బాడీ..

రష్యాలోని( Russia ) ఓ ఇద్దరు పిల్లల తల్లి మతపరమైన ఆచారంలో పాల్గొంటూ గడ్డకట్టిన నదిలోకి( Frozen River ) దూకింది.40 ఏళ్ల ఈ మహిళ సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ఆర్థడాక్స్ ఎపిఫనీని( Orthodox Epiphany ) జరుపుకోవడానికి ఈ పని చేసింది.ఈ ఫెస్టివల్ రోజున, చాలా మంది క్రైస్తవులు మంచు నీటిలో మునుగుతారు.ఇలా చేస్తే పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు.అనారోగ్యాలు నయం అవుతాయని నమ్ముతారు.

 Woman Swept Away After Leaping Into Frozen River In Russia Details, Frozen River-TeluguStop.com

అయితే ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా నదిలోకి దూకిన తల్లి కొట్టుకుపోయి చివరికి చనిపోయింది.

ఇప్పటిదాకా ఆమె బాడీ కూడా దొరకలేదు.ఆమె నదిలోకి దూకుతున్న వీడియోను @CreepyOrg అనే ట్విట్టర్ హ్యాండిల్ షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే 42 లక్షల పైగా వ్యూస్ వచ్చాయి.

వైరల్ వీడియో ప్రకారం, స్విమ్‌సూట్‌తో ఉన్న మహిళ, శిలువ గుర్తును తయారు చేసి, రాత్రిపూట ఒరెడెజ్ నదిలోకి( Oredezh River ) దూకింది.అయితే, బలమైన ప్రవాహం మంచు కింద కొట్టుకుపోవడంతో ఆమె తిరిగి ఒడ్డుకు చేరుకోలేకపోయింది.ఈ సంఘటన వీడియోలో, ఆమె భర్త నీటిలోకి డైవింగ్ చేసి ఆమెను రక్షించడానికి ప్రయత్నించాడు, కానీ అతను కూడా ఆమెను చేరుకోవడంలో విఫలమయ్యాడు.

రెస్క్యూ డైవర్లు మహిళ కోసం వెతికారు, కానీ వారు ఆమె మృతదేహాన్ని కనుగొనలేదు.ఆమె మునిగిపోయిందని భావించారు.ఇక తల్లి దూకుతుంటే సమీపంలోనే ఉన్న పిల్లలు చూశారు, ఆమె మళ్ళీ తిరిగి రాకపోవడం వారిని ఎంత బాధించి ఉంటుందో అని చాలామంది నెటిజన్లు ఫీలవుతున్నారు.

ఈ ఘటన వారు చనిపోయేంతవరకు వెంటాడుతుందని మరికొందరు పేర్కొన్నారు.ఈ పని ఒక సరస్సులో చేసినట్లయితే బాగుండేది, కానీ ఈ తల్లి నదిలో, అది కూడా రాత్రిపూట మునిగింది.

ఇలాంటి తప్పులు మరెవరు కూడా చేయరాదు అని ఇంకొందరు హెచ్చరించారు.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube