ఎస్కలేటర్‌పై లగేజీ ఇలా పెడుతున్నారా.. అయితే ప్రాణాలు పోతాయి..!

ఎస్కలేటర్‌పై( Escalator ) కిందకి దిగేటప్పుడు లేదా పైకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఏమాత్రం తెలివి తక్కువ పనులు చేసినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.

 Woman Knocked Down By Falling Suitcase On Escalator Video Viral Details, Viral N-TeluguStop.com

మూర్ఖంగా ప్రవర్తిస్తే ఇతరుల ప్రాణాలు కూడా రిస్క్‌లో పడుతుంటాయి.తాజాగా ఒక యువతి లగేజీ( Luggage ) ఎస్కలేటర్‌పై పెట్టి తాను తర్వాత దిగుదాం అనుకుంది కానీ దానివల్ల ఆమె ఊహించని ఒక ప్రమాదం జరిగింది.

దీనికి సంబంధించిన వీడియోను @PicturesFoIder ట్విట్టర్ పేజీ వైరల్ షేర్ చేసింది.దీనికి 71 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

వైరల్ అవుతున్న వీడియోలో ఎస్కలేటర్‌పైన ఉన్నవారు కిందకి వెళ్తున్న బెల్ట్ పై లగేజీ పెట్టడం మనం చూడవచ్చు.అలాగే లగేజీ బాగ్ బెల్ట్ పై వెళ్తూ కింద పడిపోయి జారుతూ శరవేగంగా దూసుకెళ్లింది.అదే మార్గంలో ఒక మహిళ ఎస్కలేటర్‌పై ఉంది.సూట్ కేస్( Suitcase ) వేగంగా వస్తుండడం చూసి ఆమె భయపడింది.తప్పుకుందామనే లోపే ఆ సూట్ కేస్ వేగంగా వచ్చి ఆమె కాళ్ళకు బలంగా తగిలింది.అంతే ఆమె ఎగిరి పడింది.

దీనివల్ల తీవ్ర గాయాలయ్యాయి ఆమె లేవలేకపోయింది.ఈ సంగతి తెలిసిన పోలీసులు, అక్కడి సిబ్బంది హుటా హుటిన చేరుకొని ఆమెను స్ట్రక్చర్ పై తీసుకెళ్లారు.

ఇది చైనాలో( China ) జరిగిందని నెటిజన్లు పేర్కొన్నారు.అయితే ఒకవేళ బాధితురాలు పని చేసుకోలేని విధంగా గాయాలు పాలైతే ఆమె బతికినంత కాలం అయ్యే ఖర్చులన్నీ దానికి కారణమైన వారే పెట్టుకోవాలి.ఎస్కలేటర్ చూసి లగేజీ బెల్టు అనుకొని పొరపాటు పడింది ఏమో అని మరి కొందరు దీనికి కారణమైన వారిని చూసి జాలి పడ్డారు.ఇలాంటి హానికరమైన ప్రవర్తన గల వారిని బయటికి పంపించకూడదని మరికొందరు అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube