ఏపీలో ఇప్పటికే పంచాయతీ ఎన్నికలతో స్థానికంగా రాజకీయం వేడెక్కింది.నాలుగు దశల్లో జరుగుతోన్న ఈ ఎన్నికలే ఏపీ రాజకీయాన్ని రంజుగా మార్చేశాయి.
అయితే ఈ వేడికి కొనసాగింపుగా ఇప్పుడు మునిసిపల్ ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చేసింది.ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గత యేడాది ఆగిన మునిసిపల్ ఎన్నికలను కంటిన్యూ చేస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.
మార్చి 10న మునిసిపల్ ఎన్నికలు జరగనుండగా… 14న కౌంటింగ్ జరగనుంది. తాజా నోటిఫికేషన్ ప్రకారం 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపల్, నగర పంచాయతీల్లో ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది.
ఈ నోటిఫికేషన్‌తో పట్టణాలు, నగరాల్లో ఏ పార్టీ సత్తా ఏమిటో తేలేందుకు ఇది వేదిక కానుంది.పార్టీ గుర్తులపై జరిగే ఈ పోరులో ప్రజాబలం ఎవరి వైపు ఉంటుంది అనేది స్పష్టం కానుంది.
పల్లె పంచాయతీ పోరులో ఫ్యాన్ పార్టీ తన సత్తా చాటుకుంది.ఇప్పటి వరకు జరిగిన రెండు దశల్లోనూ టీడీపీ సానుభూతి పరులు చిత్తుగా ఓడిపోయారు.అయితే ఇవి పార్టీ రహితంగా జరుగుతోన్న ఎన్నికలు.పట్టణాలు, మున్సిపాల్టీల్లో జరిగే ఎన్నికలు పార్టీ సింబల్‌పై జరుగుతుండడంతో ఎవరి సత్తా ఏంటో క్లారిటీ వచ్చేయనుంది.

ఇక ఈ ఎన్నికలు ముగిసిన వెంటనే తిరుపతి పార్లమెంటు స్థానానికి జరిగే ఉప ఎన్నికతో పాటు ఆ వెంటనే మండలాలు, జడ్పీటీసీలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి.ఓవరాల్‌గా సమ్మర్ వరకు ఏపీలో వరుస ఎన్నికలతో పొలిటికల్ హీట్ మామూలుగా ఉండేలా లేదు.ఇక గత సాధారణ ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 151 సీట్ల భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది.ఇక గత ఎన్నికలతో పోలిస్తే సంక్షేమ పథకాల ద్వారా తాము ప్రజలకు మరింత చేరువ అయ్యామని వైసీపీ భావిస్తోంది.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఒరవడితో పోటీ పడలేమని టీడీపీ శ్రేణులు డీలా పడడంతో పల్లె పోరులో టీడీపీ వెనక పడింది.అయితే పట్టణాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్న అంచనాల నేపథ్యంలో ఈ సారి తీర్పు ఎలా ? ఉంటుందో ? చూడాలి.