తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం( Congress ) ఏర్పడిన తర్వాత ఊహించని నిర్ణయాలే తీసుకుంటుంది.ఉద్యమకారులకు పెద్దపేట వేస్తూనే తెలంగాణ సాధనలో కీలకపాత్ర పోషించిన వారికి ప్రాధాన్యం కల్పించే ప్రయత్నాలు చేస్తోంది .
ముఖ్యంగా తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ( Kodandaram )సేవలను ఉపయోగించుకునేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కోదండరాం మద్దతును కాంగ్రెస్ కోరింది .తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఆయనతో చర్చలు జరిపారు. అలాగే కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సైతం కోదండరాం( Rahul gandhi ) తో భేటీ కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని , ఎన్నికల తర్వాత కీలక పదవి ఇస్తామని హామీ కూడా ఇచ్చారు .ఆ హామీ మేరకు కోదండరాంకు తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా అవకాశం ఇస్తారని ప్రచారం జరిగినా, ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది .
తెలంగాణకు సంబంధించి వచ్చే ఏడాది ఏప్రిల్ రెండో తేదీతో రాష్ట్రానికి సంబంధించిన ముగ్గురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం పూర్తవుతుంది. జోగినపల్లి సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్ ల పదవి కాలం పూర్తి కాబోతుండడం, ప్రస్తుత శాసనసభలో కాంగ్రెస్ కు ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా , రెండు రాజ్యసభ స్థానాలు కాంగ్రెస్ కు దక్కబోతున్నాయి.
వాటిలో ఒకటి ప్రొఫెసర్ కోదండరామ్( Kodandaram ) కు కేటాయించినట్లు సమాచారం.కాంగ్రెస్ కు భేషరుతు గా మద్దతు ఇవ్వాలని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని రాహుల్ గాంధీ కరీంనగర్ లో కోదండరాం తో బేటాయం సందర్భంగా హామీ ఇచ్చారు.దీంతో ఆయనకు ఆ పదవే ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించుకున్నారట.
రేవంత్ రెడ్డి సైతం కోదండరాం విషయంలో సానుకూలంగానే ఉండడం తో కోదండరాం కు రాజ్యసభ సభ్యత్వం దక్కే ఛాన్స్ ఖాయం కానుంది.