మహేష్ బాబు కెరీర్లోనే అతిపెద్ద సినిమాగా తెరకెక్కుతోంది తన 23వ చిత్రం.మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఇటు తెలుగు, అటు తమిళంలో ఒకేసారి చిత్రీకరణ జరుపుకుంటోంది.
తమిళనాట మురుగదాస్ కి పెద్ద పేరు ఉండటం, మహేష్ బాబుకి మంచి పాపులారిటి ఉండటంతో, ఈ సినిమా యొక్క తమిళ వెర్షన్ మీద భారి అంచనాలున్నాయి ట్రేడ్ వర్గాల్లో.దానికి తగ్గట్లే, తమిళ వెర్షన్ కి 15 కోట్లకి పైగా ఆఫర్స్ వస్తున్నాయట.
ఇక కుదిరితే ఈ సినిమాని హిందీలోకి కూడా తీసుకువెళ్ళాలనే ఆలోచన మురుగదాస్ ది.
కాని ఈ సినిమాకి ఇప్పుడు విడుదల తేది అతిపెద్ద సమస్యగా మారింది.ఏప్రిల్ లో సినిమా రావడం కష్టమైన విషయమే.ప్రస్తుతానికైతే జూన్ లో, రంజాన్ కానుకగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట.కాని పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్లు తయారయ్యింది.
రంజాన్ సమయంలో హిందీలో సల్మాన్ ఖాన్ నటించిన “ట్యూబ్ లైట్” విడుదల కాబోతోంది.
సరే, హిందీ వెర్షన్ మీద ఎలాగో పెద్ద అంచనాలు లేవుగా, సినిమా సరిగా పెర్ఫార్మ్ చేయకపోయినా ఇబ్బంది లేదు.మరోవైపు, తమిళ వెర్షన్ అలా కాదు, చాలా ముఖ్యం.
కాని అక్కడ అదే సమయానికి అజిత్ నటిస్తున్న కొత్త చిత్రం రాబోందట.చిత్రమైన విషయం ఏమిటంటే, ఈ సినిమా కూడా ఏప్రిల్ రావాల్సింది జూన్ లో వస్తుంది.
తెలుగులో ఎవరు పోటికి వచ్చినా మహేష్ చూసుకుంటాడు, కాని తమిళ్, హిందీలో అలా కాదుగా.సోలోగా వస్తేనే విజయవకాశాలు ఉంటాయి.
అసలే వంద కోట్లు పెడుతున్నారు.రెండు భాషల్లో, రెండు పెద్ద స్టార్లతో పోటిపడటం రిస్క్ కదా.