బబుల్ గమ్ నమలడం అందరికి ఇష్టమే.ముఖ్యంగా ఆటలాడేటప్పుడు బబుల్ గమ్ నమలడం ఓ ట్రెండ్ లాంటిది.
రుచితో సంబంధం లేకుండా ఫోజు కొట్టడానికి కూడా బబుల్ గమ్ నమిలే జనాలు లేకపోలేదు.అలాగే, బబుల్ గమ్ కి అలవాటు పడితే విడిపించుకోవడం కూడా కష్టమే.
కాని విడిపించుకోవాలి.
* బబుల్ గమ్ లో రుచికోసం ఆర్టిఫీషియల్ స్విటెనర్స్ వాడతారు.
ఇవి రుచిగా ఉన్నా, ఒంట్లో షుగర్ లెవల్స్ పెంచుతాయి.బబుల్ గమ్ ఒక అలవాటుగా మారడానికి కూడా ఈ స్వీటెనర్సే కారణం.
* బబుల్ గమ్ లో రెసిన్ అనే పదార్థం ఉంటుంది.దీన్ని జీర్ణించుకోవడం మన శరీరం వల్ల కాని పని.అందుకే, పొరపాటులో బబుల్ గమ్ కడుపులోకి వెళ్ళిపోతే లేని ఇబ్బందులు.
* అదేపనిగా బబుల్ గమ్ నమలడం వలన దవడ మీద ఒత్తిడి పెరిగిపోతుంది.
ఆ ప్రాంతంలో నరాలకి ఇది మంచి విషయం కాదు.నొప్పితో పాటు TJD అనే కొత్త సమస్య వచ్చే అవకాశం లేకపోలేదు.
* బబుల్ గమ్ వలన మీ కడుపులోని కొన్ని రసాయనాలు వెళ్ళిపోతాయి.ఇవి మీ మెటబాలిజంను దెబ్బతీయడమే కాదు, మీ కిడ్నీలకు కూడా ప్రమాదమై కూర్చుంటాయి.
* బబుల్ గమ్స్ లో షుగర్ ఎక్కువ ఉండటం వలన ఇది దంతాలకి ఏమాత్రం మంచిది కాదు.టూత్ డికే లాంటి సమస్య రావొచ్చు.